మోదీతో గొడవ పెట్టుకున్నది నేనే

Published: Wednesday October 10, 2018
నువ్వు పార్టీ నడపలేవు. బీజేపీలోకి వచ్చేసేయ్‌’’ అని à°† పార్టీ జాతీయ అధ్యక్షుడు తనను కోరినట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం గొడవ చేయాలంటే తానే చేయాలని, à°† శక్తి తనకు ఉందని ప్రకటించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ ఆవేశంగా ప్రసంగించారు. ‘‘ఒకసారి అమిత్‌à°·à°¾ నన్ను కూర్చోబెట్టుకుని... నువ్వు పార్టీ నడపకు! ప్రాంతీయ పార్టీల హవాలేదు. ఉన్నది జాతీయ పార్టీలే. ఎన్నికలైన 2-3 నెలల తర్వాత పార్టీని నడపలేవు! చాలా కష్టమని చెప్పారు. మరేం చేయాలని అడిగాను. బీజేపీలోకి వచ్చేయమన్నారు. జనసేన పెట్టింది బీజేపీలోకి వచ్చేందుకుకాదని, ఓడిపోయినా, గెలిచినా నిలబడాలని నిర్ణయించుకున్నాను’’ అని పవన్‌ తెలిపారు. 2016 నుంచి ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నది జనసేన ఒక్కటే అన్నారు. బీజేపీతో తనకు బంధం ఉందనే విమర్శలను తిప్పికొట్టారు. మోదీ, అమిత్‌à°·à°¾ తనకు అన్నా, పెదనాన్న కాదని చెప్పారు. బీజేపీ ద్రోహం చేసిందన్న మాటమీదే తాను ఉన్నానని తేల్చి చెప్పారు.
 
‘‘నేను మోదీ దత్తపుత్తుడినట! జగన్‌ అవినీతి పుత్రుడట! నేను కొణిదెల వెంకట్రావు పుత్రుడిని. ఎవ్వరికీ దత్తపుత్రుడిని కాదు. మోదీతో గొడవపెట్టుకున్న వాడిని నేనే. నేనంటే భయం. ముఖ్యమంత్రుల సమావేశంలో మోదీకి సీఎం కరచాలనం చేస్తున్నప్పుడు ఆయన కళ్లలో à°Žà°‚à°¤ ప్రేమ, à°Žà°‚à°¤ వినయం కనిపించిందో! నన్ను మోదీతో అలా చూశారా’’ అని ప్రశ్నించారు. ‘నేను ముఖ్యమంత్రినైతే అన్నీ చేస్తా’ అంటున్న జగన్‌లా, ‘మళ్లీ సీఎంను చేస్తే బాగా చేస్తా’ అని బాబులా తాను పార్టీని స్థాపించలేదన్నారు. ఎక్కడెక్కడో ఐటీ సోదాలు జరిగితే ముఖ్యమంత్రికి ఎందుకు భయమని నిలదీశారు. పోలవరం సందర్శనపైనా పవన్‌ విమర్శలు గుప్పించారు. ‘‘ప్రతీ రోజు వందలమంది పోలవరం వస్తున్నారు. ఇక్కడ చూడడానికి ఊచలు, సిమెంటు తప్ప ఏముంది? తిన్నంత తిండి, తాగినంత మందు ఇస్తే అంతా బాగుందనే చెబుతారు’’ అని ఎద్దేవా చేశారు. నిర్వాసితుల సమస్యలపై పార్టీ తరఫున కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
 
త్యాగాలు మీరు చేయండి...
ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చివేసి వారు రోడ్లుపై కూర్చుంటే అప్పుడు నిర్వాసితుల సమస్యలు తెలుస్తాయని పవన్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ముంపు గ్రామమైన పైడిపాకలో ఆయన నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాదాపురం గ్రామంలో ఆయన నిర్వాసితులతో సమావేశం అయ్యారు. పోలవరం మెయిన్‌ రోడ్డులో కూడా ప్రజలను ద్దేశించి ప్రసంగించారు. ‘‘జగన్‌లాగా పాదయాత్ర చేసి కూర్చో బెట్టి ముద్దులుపెట్టడానికి రాలేదు. నిర్వాసితుల కష్టాలు తెలుసుకుని వారి పక్కన నిలబడడానికి వచ్చాను. నేనూ బస్సులు ఏర్పాటు చేస్తా. పోలవరం నిర్వాసితులను రాజధానికి తీసుకు వెళ్తా. అక్కడ గళమెత్తుదాం’’ అని అన్నారు.