పెను తుఫానుగా తితలీ!

Published: Thursday October 11, 2018
ఉత్తరాంధ్రను తుఫాను వణికిస్తోంది. ‘తితలీ’ అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది పెను తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై ‘రెడ్‌ మెసేజ్‌’ జారీ చేసింది. అతితీవ్ర తుఫానుతో బుధవారం సాయంత్రానికి గాలుల ఉధృతి పెరిగింది. గురువారం ఉదయం ఇది తీరం దాటే సమయంలో దక్షిణ ఒడిసా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 140 నుంచి 150... ఒక్కొక్కసారి 165 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. బుధవారం రాత్రి నుంచే ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురవడం మొదలైంది. తుఫాను తీరం దాటే సమయంలో దక్షిణ ఒడిసా, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం నుంచి విశాఖ జిల్లా వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాలలో కుంభవృష్టిగా కురుస్తాయి. ఉభయ గోదావరిజిల్లాల్లో కూడా à°’à°• మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం అలలు ఉవ్వెతున్న ఎగిసిపడనుండటంతో తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంది.
 
భారీ విపత్తు?
కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో 10à°µ నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. విశాఖపట్నం, గంగవరం ఓడరేవుల్లో 8... కాకినాడ, మచిలీపట్నంలో మూడు, మిగిలిన చోట్ల 2à°µ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. కళింగపట్నం, భీమునిపట్నం రేవుల్లో పదో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం హుద్‌హుద్‌ తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తితలీ తీవ్రతకు విద్యుత్‌, కమ్యూనికేషన్స్‌ వ్యవస్థకు అంతరాయం కలిగే ప్రమాదముందని... రహదారులు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతింటాయని భావిస్తున్నారు. భారీగా పంటనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.
 
ఆందోళనలో మత్స్యకారులు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటి మండలం కొత్తపాలెం వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. ఇక్కడ 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. సంతబొమ్మాళి మండలంలోని à°¡à°¿.మరువాడ తీరంలో సముద్రం ముందుకు వచ్చింది. ఇసుక దిబ్బలు కోతకు గురయ్యాయి. హుద్‌హుద్‌ తర్వాత à°ˆ స్థాయిలో గాలులు వీయడం ఇప్పుడే చూస్తున్నామని మత్స్యకారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం వద్ద సముద్రం బుధవారం ఉదయం 10 à°—à°‚à°Ÿà°² సమయంలో 150 అడుగులు ముందుకొచ్చింది. భీకర శబ్దంతో అలలు తీరంపై విరుచుకుపడుతుండటంతోమత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కొండ్రాజుపాలెంలో మత్స్యకారులు పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా జిల్లాలోనూ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతాలైన పాలకాయితిప్ప, బసవన్నపాలెం, ఊటగుండం తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి.