మీడియాతో పవన్‌ కల్యాణ్‌ రాఫెల్‌పై సమాధానం దాటవేత

Published: Sunday October 14, 2018
‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మా అన్న కాదు. అమిత్‌ à°·à°¾ బాబాయ్‌ కాదు. కనీసం బీజేపీ నేతలతో నాకు బంధుత్వం కూడా లేదు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. విజయవాడలో శనివారం ఉదయం జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. à°ˆ సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా మొదలుకొని ఐటీ దాడుల వరకు పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. రోజుకొక పార్టీతో తమను ముడిపెడుతున్నారని, బీజేపీతో తాను కుమ్మక్కు అయినట్లు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇద్దరి(టీడీపీ-బీజేపీ)తో కలిసి ప్రయాణం చేశానని, ఒకరు మోసం చేస్తే మరొకరు మాట మారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి పనికొస్తుందని భావించానని, ఆయన ఒక్కో సందర్భంలో ఒక్కోమాట చెబుతున్నారని విమర్శించారు. హోదా విషయంలో మొదటి నుంచి జనసేన ఒకేమాటపై ఉందని, ముఖ్యమంత్రిలోచిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని, అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేద్దామని అన్నారు. గతంలో చంద్రబాబు నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి మీరెందుకు వెళ్లలేదని మీడియా ప్రశ్నించగా అందులో తనకు చిత్తశుద్ధి కనిపించలేదని, అందుకే వెళ్లలేదని బదులిచ్చారు.
 
 
అందుకే నాదెండ్లను ఆహ్వానించాం
రాఫెల్‌ కుంభకోణంపై జనసేన ఎందుకు మాట్లాడటం లేదన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. తెలంగాణ ఎన్నికల్లో 24 చోట్ల పోటీ చేయాలని అనుకున్నామని, అయితే, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై చర్చిస్తున్నామని చెప్పారు. తుఫాను బాధితులకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచేందుకు శ్రీకాకుళం వెళ్లాలనుకున్నానని, అక్కడి పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదని వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలన్న ఉద్దేశంతోనే నాదేండ్ల మనోహర్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు పవన్‌ పేర్కొన్నారు. వ్యాపారాలు చేసుకునే వారిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తే తానెందుకు స్పందించాలని పవన్‌ ప్రశ్నించారు. వీటిని ప్రభుత్వంపై జరిగిన దాడిగా పరిగణించలేమన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కార్యాలయంపై జరిగిన తరహాలో ఏపీలో జరిగితే కచ్చితంగా మాట్లాడతానన్నారు.
 
 
కమ్యూనిస్టులతో కలిసి పోరాటాలు
ప్రజా సమస్యలపై జనసేన, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోరాటం చేసే అంశాలపై ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. శనివారం ఆయన సీపీఐ, సీపీఎం నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. కరవు, కౌలు రైతులు, నిర్వాసితులు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్‌ కార్మికుల సమ్మె, తెలంగాణ, ఏపీల్లో ఎన్నికల నిర్వహణ, రామాయపట్నం పోర్టు పోరాటంపై చర్చించారు. à°ˆ సందర్భంగా à°ˆ నెల 15à°¨ జనసేన చేపట్టే కవాతుకి సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. ప్రజలు టీడీపీ, వైసీపీయేతర ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.