25 ఏళ్లు పెంచిన కొబ్బరితోటలు కళ్లముందే పోవడంతో కలత

Published: Monday October 15, 2018
తోటల్లో కాయ లేదు. పొలాల్లో పచ్చదనం లేదు. బతుకుకు భరోసానిచ్చిన నిలువెత్తు కొబ్బరిచెట్లు నిలువునా కూలిపోయాయి. మట్టిగోడల ఇళ్లలో దాచుకొన్న తిండి గింజలు, పాత్రలు మట్టిగొట్టుకుపోయి గ్రామాలకు గ్రామాలు సాయం కోసం శోకన్నాలు పెడుతున్నాయి. కళ్లముందే వేళ్లతో సహాచెట్లు పెకిలించుకునిరావడంతో.. చెట్టంత బిడ్డ చనిపోయినట్టు దుఃఖపడుతున్నారు. ఒక్క రైతులే కాదు, à°Ÿà±€ కొట్లు, కిరాణా దుకాణాలు, క్లాత్‌ షాపులను నడుపుకొంటున్న మధ్యతరగతి ప్రజలూ కల్లోలసుడిలో చిక్కుకున్నారు.
 
సీఎం చంద్రబాబు చొరవ, బాధితులకు à°…à°‚à°¡à°—à°¾ ప్రకటించిన నష్టపరిహారం కొంత à°Šà°°à°Ÿ ఇస్తున్నా, ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ‘తుఫాను’ బీభత్సం తొలగిపోలేదు. సీఎం చంద్రబాబు పురమాయింపుతో తమ గ్రామాలకు వస్తున్న నేతలకు, అధికారులకు దండాలు పెట్టి.. ‘ఆదుకోండయ్యా’ అంటూ మొత్తుకొంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. పండు ముదుసరులు తన కాళ్లపై పడుతుండటంతో అధికారుల మనసు చివుక్కుమంటోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ‘తితలీ’ దెబ్బకు 12 లక్షలమందికన్నా ఎక్కువమందే బాధితులుగా మారిపోయారు. ఉద్దానంలో ఎక్కువనష్టం చోటుచేసుకొంది. రాత్రికి రాత్రే లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. ఇదంతా à°’à°• ఎత్తు అయితే, కొబ్బరితోటలు భారీఎత్తున దెబ్బతినడం వారిని కలతపెడుతోంది.
 
ఉద్దానం తదితర ప్రాంతాల్లో కొబ్బరి చెట్టును ఇంట్లో కొడుకుగా చూస్తారు. à°ˆ ప్రాంతంలో కోటిచెట్లు దాకా ఉంటాయని అంచనా. ఇందులో 75శాతం చెట్లు దెబ్బతినిపోయాయి. వీటి వయస్సు 25 ఏళ్లకుపైనే ఉంటుంది. అంటే, ఎదిగొచ్చిన కొడుకు చందమన్నమాట. దీంతో తమ à°Šà°°à°¿à°•à°¿ ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే అధికారులేమో అనుకుని, అతణ్ణి చుట్టుముడుతున్నారు. కూలిన కొబ్బరిచెట్లను చూపిస్తూ ‘‘చూడండయ్యా. ఎలా జరిగిపోయిందో. మాకు ఇక దిక్కేది’’ అంటూ దీనంగా చేతులు జోడించి రోదిస్తున్నారు. పడిపోయిన ఒక్కో కొబ్బరిచెట్టుకు ప్రభుత్వం రూ.1200 పరిహారం ప్రకటించింది.