ఎన్టీఆర్‌ ట్రస్ట్‌.. వైద్యులకు షాక్‌!

Published: Wednesday October 17, 2018
ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ను నమ్ముకుని విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ఆరోగ్యశాఖ షాక్‌ ఇచ్చింది. వైద్యుల నియామాకాల్లో ట్రస్ట్‌ డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వలేమని తెలిపింది. కేవలం డీహెచ్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ వైద్యులకు మాత్రమే వెయిటేజీ ఇస్తామని పేర్కొంది. వైద్యుల నియామకాలకోసం ఆరోగ్యశాఖ ఇచ్చిన జీవోలు, నోటిఫికేషన్‌, మెమోలు ట్రస్ట్‌ వైద్యులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆరోగ్యశాఖ తీరుపై ట్రస్ట్‌ వైద్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో సుమారు 45 మంది వైద్యులు కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు.
 
వీరందిరికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశాలున్నా.. ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి ట్రస్ట్‌లో సేవలు అందిస్తున్నారు. ట్రస్ట్‌ ఇస్తున్న జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ ఉండిపోయారు. ఆరేడేళ్ల నుంచి వీరు ట్రస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశాఖ అధికారులు వారి ఆశలపై నీల్లుజల్లారు. నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వలేమని తేల్చిచెప్పారు. వాస్తవానికి వైద్యుల నియామకాల్లో ట్రస్ట్‌ వైద్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రస్ట్‌ సీఈవో ఆరోగ్యశాఖ అధికారులు లేఖ రాశారు.
 
ఇదీ జరిగింది
కాంట్రాక్ట్‌ వైద్యులంతా ఎక్కువగా డీహెచ్‌ పరిధిలో ఉంటారు. వీరి నియామకం మొత్తం జిల్లాల్లోనే జరుగుతుంది. కాంట్రాక్ట్‌ వైద్యులను నియమించుకునే సమయంలో జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో డిస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీ(డీఎస్సీ) ఉంటుంది. జిల్లాల్లో కాంట్రాక్ట్‌ వైద్యుల నియామకం మొత్తం డీఎస్సీ ద్వారానే జరుగుతుంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో వైద్యులకు నియామకాలు వేరేలా ఉంటాయి. ట్రస్ట్‌ రాష్ట్రం మొత్తానికి చెందింది కావడంతో వైద్యుల నియామానికి ప్రత్యేక కమిటీ ఉంది. ట్రస్ట్‌ సీఈవో నేతృత్వంలో స్టేట్‌ సెలక్షన్‌ కమిటీ వైద్యులతో పాటు మిగిలిన ఉద్యోగులను నియమిస్తుంది. వైద్యుల నియామకాల్లో ట్రస్ట్‌ డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
 
ట్రస్ట్‌ సీఈవోకు ఆరోగ్యశాఖ ఇచ్చిన మెమోలో à°ˆ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. డీఎస్సీ ద్వారా ఎంపికైన వారికి మాత్రమే వైద్యుల నియామకంలో ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పింది. దీంతో ట్రస్ట్‌ వైద్యులు à°ˆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. డీఎస్సీ కంటే, స్టేట్‌ సెలక్షన్‌ కమిటీకి అధికారులు ఎక్కువ ఉంటాయని ఇలాంటి కమిటీ ద్వారా నియామకమైన తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశాఖ అధికారులు దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
సీఎం ఆమోదం లేకుండానే..
ట్రస్ట్‌ సీఈవో ఆరోగ్యశాఖకు రాసిన లేఖ సీఎం చంద్రబాబుకు కూడా వెళ్లినట్లు సమాచారం. దీనిపై ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించక ముందే ఆరోగ్యశాఖ అధికారులు à°’à°• మెమో విడుదల చేశారు. సాధారణంగా ఇలాంటి కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్‌ సీఎం దగ్గరకు వెళ్లిన తర్వాత, ఆయన ఆమోదం లేకుండా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ కూడా సీఎం చంద్రబాబు వద్దనే ఉంది. కాబట్టి à°† శాఖకు సంబంధించిన విషయాలు ఆయన దృష్టిలో పెట్టి ఆయన ఆమోదం తెలిపితే తప్ప అమలులోకి వచ్చే వీలుండదు.