తితలీ బాధితులకు అమరావతి జేఏసీ చేయూత

Published: Thursday October 18, 2018

అమరావతి: à°¤à°¿à°¤à°²à±€ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జరిగిన నష్టానికి ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి నిర్ణయించినట్లు అమరావతి జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యకార్యదర్శి సతీష్‌ చంద్రను కలసి విరాళం మొత్తాన్ని à°ˆ నెల జీతం నుంచి తగ్గించుకునేలా ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోరినట్లు వారు చెప్పారు. చివరి తరగతి ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగుల నుంచి రూ. రెండు వందలు, మిగిలిన అన్ని క్యాడర్ల సిబ్బంది, ఉపాధ్యాయుల నుంచి రూ.ఐదు వందలు ఇస్తున్నట్లు వారు తెలియజేశారు.