‘రైతు రథాల’పై కంపెనీల వల

Published: Sunday October 21, 2018
దుక్కులు నుంచి విత్తడం, కలుపు తీయడం, తడులు పెట్టడం, కోతలు.. ఇలా సాగు చక్రంలోని ప్రతి దశలోనూ రైతులకు à°…à°‚à°¡à°—à°¾ రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. అయితే, పథకం ఏదయినా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడమే రైతులకు మిగిలేది. వారికి దక్కాల్సిన లబ్ధిలో చాలాభాగం మధ్య దళారులు, కొందరు అవినీతి అధికారుల జేబుల్లోకి పోయేది. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన రైతురథం కూడా దీనికి మినహాయింపు కాదు. నిజానికి ఇది చాలా మంచి పథకం. అన్నదాతలు సొంత ట్రాక్టరును సమకూర్చుకొనేందుకు ప్రభుత్వం à°ˆ పథకంలో వీలు కల్పించింది. అయితే, ‘రైతు రథం’ అమలు ఆచరణలో అత్యంత సమస్యాత్మకంగా మారడంతో, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. డైరెక్ట్‌ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్‌-డీబీటీ పద్ధతిని ప్రవేశపెట్టింది.
 
నేరుగా ప్రభుత్వానికే లబ్ధిదారు దరఖాస్తు చేసుకొని రైతురథం సహా ఏ సాగు పథకం నుంచయినా అర్హతను బట్టి లబ్ధి పొందే అవకాశం దీనివల్ల రైతులకు కలిగింది. ‘ఇండియా.జీవోవీ.ఇన్‌’ లో పేరు, వివరాలు నమోదు చేసుకుంటే రాయితీ పరికరాలను రైతులు.. పోర్టల్‌లో లిస్టు అయిన కంపెనీల నుంచి నేరుగా పొందే వీలుంది. ఇప్పటిదాకా 32వేల మందిపైగా రైతులు à°ˆ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయ్యారు. చాలా మేరకు ‘డీబీటీ పోర్టల్‌’ మంచి ఫలితాలనే సాధించింది. అయితే, కొన్ని చోట్ల మాత్రం à°ˆ పద్ధతినీ వక్రమార్గం పట్టించి, రైతులను నిలువునా దోచుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. à°ˆ పోర్టల్‌లో రిజస్టర్‌ చేసుకున్న రైతుల వద్దకు ముందుగానే వివిధ కంపెనీల ప్రతినిధులు వాలిపోతున్నారు. ‘మీ దరఖాస్తు ఆమోదం పొందిన తరువాతే డబ్బులు కట్టండి’ అంటూ ట్రాక్టరును చేతిలో పెడుతున్నారు. కంపెనీలు ఎందుకింతలా రైతులపై ప్రేమ చూపిస్తున్నాయని ఆరా తీస్తే.. కొత్త కోణం వెలుగు చూసింది.
 
కొద్ది డబ్బు.. ఖాళీ చెక్‌లు.. అంతే..
కొన్ని కంపెనీల ప్రతినిధులు జిల్లా వ్యవసాయశాఖ అధికారుల వద్ద రైతురథం పథకం à°•à°¿à°‚à°¦ దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను ముందుగానే సేకరిస్తున్నారు. à°† రైతుల ఇళ్లకు సరాసరి వెళుతున్నారు. ‘‘మీకు కావాల్సిన ట్రాక్టర్‌ మేమిస్తాం. ముందు రూ.50వేలు కట్టండి. రైతురథంలో రాయితీపోను, మిగిలిన మొత్తానికి ఖాళీ చెక్కులు ఇవ్వండి. లేదంటే రూ.100బాండ్‌ పేపర్‌పై సంతకం చేయండి చాలు’’ అని రైతులను వారు ఒప్పిస్తున్నారు. ఇలా కృష్ణా, à°•à°¡à°ª, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 600 ట్రాక్టర్లను రైతులకు à°ˆ కంపెనీలు అమ్మినట్టు సమాచారం. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, ప్రొద్దుటూరు, భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో కంపెనీ ప్రతినిధుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.