గుడికి వచ్చేందుకు 9 మంది యత్నం

Published: Monday October 22, 2018

మహిళలకు ప్రవేశం వద్దని లక్షలాది మంది నిరసన.. హిందువుల మనోభావాలు దెబ్బ తీయోద్దన్న వాదన.. సుప్రీం కోర్టు తన తీర్పును సమీక్షించాలన్న వినతి.. వెరసి ఐదు రోజుల పాటు శబరిమల పరిసరాలు ధర్నాలతో, ర్యాలీలతో హోరెత్తాయి. స్త్రీలు అడుగు ముందుకేస్తే ఆత్మాహుతి చేసుకుంటామన్న శివసేన హెచ్చరిక మొదలు ప్రతిక్షణం పరిస్థితి ఉద్రిక్తమే. నెలవారీ పూజల కోసం à°ˆ నెల 17à°¨ ఆలయ ద్వారాలు తెరుచుకోగా ఆదివారం వరకు మొత్తం తొమ్మిది మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇందులో ఏ ఒక్క రూ స్వామిని దర్శించుకోలేకపోయారు. అయ్యప్ప దర్శనానికి వచ్చిన బాలమ్మ(47) అనే మహిళను ఆందోళనకారులు దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యింది. ఇక, సోమవారం అయ్యప్ప ఆలయ తలుపులు మూసుకోనున్నాయి. ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ముస్లిం సమాజం బహిష్కరించింది. ఆలయంలో మహిళల కు ప్రవేశం కల్పించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నించడం సనాతన ధర్మానికి విసిరిన సవాలుగా భావిస్తున్నానని కేరళలోని తిరువిదాంకూర్‌ రాణి గౌరీ లక్ష్మీబాయి తంబురాట్టి అన్నారు