ఏలూరు కోర్టుకు వాస్తు దోషం..!

Published: Friday October 26, 2018
ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణానికి వాస్తు దోషం ఉన్నట్టుగా పలువురు పండితులు సూచించడంతో ప్రధాన గేటును మూసివేసినట్టు తెలుస్తోంది. గతంలో పాత గేట్లు రెండు వైపులా ఉండగా వాటి నుంచి రాకపోకలు సాగించేవారు. కొంతకాలం క్రితం కోర్టుకు మధ్యలో ప్రధాన ద్వారాన్ని ఆర్చి ఏర్పాటుచేసి గేట్లను నిర్మించారు. అయితే ఈ గేటు ఏర్పాటు చేసినప్పటి నుంచి కొందరు న్యాయవాదులు మరణించడం, ఆ గేటు ఎదురుగా ఉన్న కోర్టులో పనిచేస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మరణించడంతో కోర్టు సిబ్బంది ఆందోళనకు గురైనట్టు సమాచారం. వివిధ పనులపై కోర్టుకు వచ్చే పండితులు కోర్టుకు వాస్తు దోషం ఉన్నట్టుగా కొందరు న్యాయవాదులకు సూచించినట్టు తెలుస్తోంది.
 
 
ఇదే విషయాన్ని బార్‌ అసోసియేషన్‌ దృష్టికి పలువురు తీసుకువెళ్ళడంతో వారంతా à°ˆ గేటు మూసివేయాలని ప్రధాన న్యాయమూర్తిని కోరినట్టు సమాచారం. పాత గేట్ల ద్వారానే రాకపోకలు సాగించడం వల్ల అందరికీ క్షేమకరమని, తమ మనసులో ఉన్న ఆందోళన పోవాలంటే à°† గేటును మూసివేయాలని న్యాయవాదులు కోరినట్టు తెలిసింది. దీంతో ప్రధాన గేటును మూసివేసి అక్కడ à°’à°• ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. పాత గేట్ల ద్వారానే రాకపోకలు సాగించాలని సూచించారు.