ఢిల్లీ కేంద్రంగా వైసీపీ భారీ వ్యూహం?

Published: Monday October 29, 2018
ఢిల్లీ కేంద్రంగా వైసీపీ భారీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో శాంతిభద్రతలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్‌తో à°† పార్టీ పావులు కదుపుతున్నట్లు వినికిడి. అందులోభాగంగా వైసీపీ నేతల బృందం కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసింది. à°† పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గతంలో రాజీనామా చేసిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు హోం మంత్రితో సమావేశమయ్యారు. à°ˆ నెల 25à°¨ విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని, ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని జగన్‌తో సహా à°† పార్టీ నేతలంతా పదేపదే రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు. రాజ్‌నాథ్‌ను కలిసిన నేతలు దాడిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
 
à°ˆ నేపథ్యంలోనే.. à°°à°¾à°·à±à°Ÿà±à°°à°ªà°¤à°¿ రాజ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ కోరినట్లు à°† పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే అపాయింట్‌మెంట్‌పై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇవాళ సాయంత్రం లేదా మంగళవారం రాష్ట్రపతితో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తేవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు వినికిడి. జగన్‌పై జరిగిన దాడి ఘటనపై సీఎస్‌ఎఫ్ చూసుకుంటుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వైసీపీ మాత్రం దాడి ఘటనను ఏపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు వైసీపీ నేతలు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రమంత్రులు, ఇతర నేతలను కలిసి ఇదే అంశాన్ని వారి దృష్టికి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం.