అధికారుల తీరుపై మంత్రి అమరనాథరెడ్డి ఆగ్రహం

Published: Tuesday November 06, 2018
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేనే గ్రామాల్లో తిరుగుతుంటే....మీరెందుకు పట్టించుకోరని అధికారుల తీరుపై మంత్రి అమరనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మంత్రి అమరనాథరెడ్డి సోమవవీఆఆరం వి.కోట మండల పరిధిలోని పాముగానిపల్లె పంచాయతీలో విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాత్తూరులో మహిళలు సమస్యలపై మంత్రిని చుట్టుముట్టారు. ఐదేళ్ళుగా తమ గ్రామంలో సీసీ రోడ్డుగానీ, పక్కా గృహాలుకానీ మంజూరు చేయలేదని.. కట్టుకున్న ఇళ్ళకు బిల్లులు రాలేదని.. మురుగునీరు ఇళ్ల ముందు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని ఫిర్యాదు చేశారు.
 
దీనిపై మంత్రి అధికారులను వివరాలడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించగా కొందరు అందుబాటులో లేరు. దీంతో అసహనానికి లోనైన మంత్రి అధికారులకు బాధ్యత లేదా..? నేను ఇంత బిజీగా ఉన్నా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పల్లెలకు వస్తుంటే మీరేమో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారా..? పనిచేయడం ఇష్టం లేకుంటే ఇళ్ళకు వెళ్ళండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. సీసీ రోడు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు లేరని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గుమ్మిరెడ్డిపల్లె, బైసుకుప్పం, పాముగానిపల్లెల్లో రూ. 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, రూ. 10 లక్షలతో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
 
వేణుగోపాలపురం వద్ద కొత్తగా నిర్మిస్తున్న చేపల కుంట పనులకు భూమి పూజ చేశారు. పాముగానిపల్లె, పాత్తూరులో 16 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాలను మంత్రి ప్రారంభించారు. అక్కడే వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు. పాత్తూరు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వారం రోజులుగా కోడిగుడ్డు పెట్టడం లేదని విద్యార్థులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఎంఈవోను à°ˆ విషయమై వివరణ కోరగా ఏజన్సీలతో ఏర్పడిన సమస్య కారణంగా కోడిగుడ్లు రాలేదని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. గుమ్మిరెడ్డిపల్లెలో కృష్ణమ్మ కొండ చుట్టూ ఉన్న భూమిని బోగస్‌ పట్టాలతో కబ్జా చేయాలని కొందరు చూస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు.
 
దీనిపై స్పందించిన మంత్రి కొండ భూముల జోలికి ఎవ్వరు వచ్చినా ఉపేక్షించేది లేదని, à°ˆ భూముల్లో అటవీశాఖ ద్వారా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలని రేంజర్‌కు ఫోన్‌లో ఆదేశాలిచ్చారు. ఎంపీపీ సులోచన, ఏఎంసీ మాజీ చైర్మన్‌ రామచంద్ర నాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు రంగనాథ్‌, ప్రధాన కార్యదర్శి సోము, ఎంపీటీసీ దామోదర నాయుడు, నాయకులు కాంతారాం, మహేష్‌రెడ్డి, చౌడప్ప, రత్నప్ప, మోహన్‌రావ్‌, రామకృష్ణాచారి, కేశవులు, శ్రీనివాసులు, బలరాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి దశరథరామిరెడ్డి, ఎంపీడీవో బాలాజీ, తహసిల్దార్‌ సుబ్రమణ్యం, ఎంఈవో చంద్రశేఖర్‌, ఏఈలు రాజేంద్ర, లోకనాథం, రాము, రవి పాల్గొన్నారు.