నాలుగున్నరేళ్ల ప్రగతిని ప్రజలకు వివరించాలి

Published: Friday November 09, 2018

‘మనం à°’à°• స్ఫూర్తిదాయక సమయంలో ఉన్నాం. బృంద స్ఫూర్తితో పనిచేస్తేనే విజయాలు సాధించగలం. మా గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగిందా? అని రచ్చబండల వద్ద ప్రగతి చర్చ జరగాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. గురువారం ‘గ్రామదర్శిని’పై జిల్లాల కలెక్టర్లు, నోడల్‌ అధికారులు, వివిధ శాఖల సిబ్బందితో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. à°ˆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘నాలుగున్నరేళ్ల ప్రగతి వివరాలను గోడరాతలతో వివరించాలి. మనం చేసిన పనులను ప్రజలకు చెప్పాలి. గ్రామదర్శిని అందుకు గొప్ప వేదిక. గ్రామ దర్శిని తర్వాత ప్రజల్లో 5ు సంతృప్తి పెరిగింది. ప్రభుత్వం పట్ల సంతృప్తి 72 నుంచి 77 శాతానికి పెరిగింది. తితలీ తుఫాన్‌ సహాయ చర్యలకు తొలిరోజు ఇబ్బంది పడ్డాం. తర్వాత అందరూ అద్భుతంగా పని చేశారు. 25 రోజుల్లో పరిహారంతో సహా అంతా చక్కదిద్దాం. కేంద్రం నుంచి బాధితులకు సహాయం లేదు. మన వనరులతోనే బాధితులను ఆదుకున్నాం’ అని సీఎం చెప్పారు.