బీజేపీవి పాచిపోయిన లడ్డూలు.. టీడీపీవి తినలేం..వైసీపీవి వాళ్లకే

Published: Tuesday November 13, 2018
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్‌లోకి దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్‌ను తీసుకోవడంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘à°’à°• గిరిజన ఎమ్మెల్యే చనిపోతేగానీ, సీఎం చంద్రబాబుకు గిరిజనులు గుర్తుకు రాలేదు. ఇంతకాలం వారి సంక్షేమం విషయంలో చిన్న చూపే చూశారు. సర్వేశ్వరరావు కుమారుడి à°•à°¿ మంత్రి పదవి ఇస్తే అదంతా పోతుందా? శ్రావణ్‌కు న్యాయం చేస్తే సరిపోదు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలు వెంటనే కల్పించాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఎంతో కీలకమైన ఆరోగ్యశాఖకు ఆరునెలలుగా మంత్రంటూ లేరన్న ఆయన, ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా అని నిలదీశారు. ప్రజా పోరాట యాత్ర పేరిట తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన, సోమవార à°‚ సాయంత్రం కాకినాడలో à°† పార్టీ కేడర్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
 
ప్రధాన పార్టీలను లడ్డూలతో పోల్చుతూ పవన్‌ విరుచుకుపడ్డారు. ‘‘బీజేపీ పాచిపోయిన లడ్డూల పార్టీ. కాంగ్రె స్‌తో జత కట్టిన టీడీపీ తినడానికి పనికిరాని లడ్డూల పార్టీ. నాయకులు, కార్యకర్తలు మాత్రమే లడ్డూలు తినే పార్టీ వైసీపీ’ అంటూ ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీ, వైసీపీలకు సిద్ధాంతం అంటూ ఏమీ లేదని, à°† పార్టీల అజెండా కేవలం సీఎం కుర్చీ మాత్రమేనని అన్నారు. ‘‘అధికారం కోసం à°† పార్టీలు ఎంతకైనా తెగిస్తాయి. కుల రాజకీయాలు చేసి రాష్ర్టాన్ని మరో బిహార్‌, యూపీలా విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాయి. అది నేను బతికుండగా జరగనివ్వను’’ అని అన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారని విమర్శించారు. ‘చంద్రబాబుకు ముందుచూపు ఉందనుకున్నా. కానీ, ఆయన చేస్తున్న పనులు, వాడుతున్న భాషను చూస్తే బాధేస్తోంది.
 
రాష్ట్రంలో 13 జిల్లాలుండగా ఒక్క అమరావతిలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయడమేమిటి? తాను కట్టించిన ఇళ్లలోనే ఉంటున్నారు.. తాను ఇచ్చిన నీళ్లే తాగుతున్నారు.. తాను కట్టించిన మరుగుదొడ్లే వాడుకుంటున్నారని à°’à°• సీఎం అనడం సరైనదా? ఇన్ని ఇచ్చిన తనను కాదని ఇంకెవరికి ఓట్లు వేస్తారని ఆయన అనడం ఎంతవరకు సబబు?’’ అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రె్‌సల ఉనికి నిర్వీర్యం అయ్యే రోజులు దగ్గరపడ్డాయన్న ఆయన, చైతన్యానికి మారుపేరు అయిన గోదావరి జిల్లాల ప్రజల సాక్షిగా à°ˆ మాట చెబుతున్నానన్నారు. ‘‘1996లో కాకినాడ వేదికగా ‘à°’à°• ఓటు-రెండు రాష్ర్టాలు’ నినాదంతో బీజేపీ కుట్ర చేసింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలువునా తుంగలో తొక్కింది. రాష్ట్ర విభజనలో అడ్డగోలుగా వ్యవహరించి ఆంధ్రులను నట్టేట ముంచింది. కనీసం ప్రత్యేక హోదానీ ఇవ్వకుండా ఆంధ్రులను మోసం చేసింది’’ అని విమర్శించారు.