ప్రజా సమస్యలు వదిలి రోడ్లపై యాత్రలా?

Published: Wednesday November 14, 2018
ప్రజాసమస్యలపై నిలదీసేందుకు ఎమ్మెల్యేలను గెలిపిస్తే... అసెంబ్లీకి వెళ్లడం మానేసి రోడ్లపై తిరుగుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్‌పై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని హితవు పలికారు. ‘ప్రజా పోరాట యాత్ర’లో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో జరిగిన సభలో పవన్‌ ప్రసంగించారు. ‘చంద్రబాబు తప్పులు చేస్తున్నారు. మీరు శాసనసభకు వెళ్లండి. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేని నేను ఇన్ని ప్రజా సమస్యలు బయటకు తీసుకొచ్చి పరిష్కరిస్తున్నాను. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి వెళ్లకుంటే ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఓదార్పు యాత్రలు చేస్తుంటే ఎలా? మీరు అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై నిలదీస్తే అప్పుడు మీ మగతనం బయటకి వస్తుంది’ అని పవన్‌ ఆగ్రహంగా అన్నారు.
 
à°† ధైర్యం జగన్‌కు లేదు
తెలంగాణలో నాయకులకు ఎదురుచెప్పే ధైర్యం జగన్‌కు లేదని పవన్‌ విమర్శించారు. ‘‘ఆంధ్రులు దోపిడీదారులని తిడుతుంటే... ప్రజలు వేరు, పాలకులు వేరే అని చెప్పే దమ్ము కూడా జగన్‌కు లేదు. ఇక... చందబ్రాబు తీరు పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్లు ఉంటుంది. అలాంటి సమయంలో దమ్ముతో మాట్లాడింది నేనొక్కడినే’’ అని పవన్‌ తెలిపారు. తన వ్యక్తిగత జీవితంపై జగన్‌ గతంలో చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ... ‘‘తెలంగాణ నేతలను అనే ధైర్యం లేని జగన్‌కు... మా ఇంటి ఆడపడుచులను తిట్టే ధైర్యం మాత్రం ఉంది. పవన్‌ సినిమా వాడు ఏం చేస్తాడనుకుంటున్నారా!! జగన్‌ à°Žà°‚à°¤ రెచ్చగొట్టినా మాట్లాడకపోవడానికి కారణం... మా తల్లి నేర్పిన సంస్కారం’’ అని తెలిపారు.
 
కులాలకు వ్యతిరేకం...
దళితులు, బడుగు, బలహీనవర్గాలు పాలితులుగా కాకుం à°¡à°¾ పాలకులుగా చూడాలన్నదే జనసేన లక్ష్యమని పవన్‌ తెలిపారు. 2019 ఎన్నికల్లో జనసేనకు అధికారమిస్తే స్వచ్ఛమైన పాలన అందిస్తామన్నారు. తాను కులాలకు వ్యతిరేకమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. జనసేన పార్టీ పెట్టకుండా కాంగ్రెస్‌ పెద్దలు తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటివి చూసి... కుటుంబాన్ని వదులుకొని 2014లో పార్టీని ఏర్పాటు చేశానన్నారు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు అభ్యర్థన మేరకు రాష్ట్రాభివృద్ధి కోసం జనసేన ఆయనకు మద్దతునిచ్చిందని తెలిపారు.
 
ఓటమికైనా సిద్ధమే.. విలువలు వీడను
‘‘రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి అయిపోదామన్న కాంక్షతో రాజకీయాల్లోకి రాలేదు. ఓటమికైనా సిద్ధపడతాను కానీ, విలువలు మాత్రం వీడను’ అని పవన్‌ స్పష్టం చేశారు. కాకినాడలోని జీ-కన్వెన్షన్‌ హాలులో ఆయన పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. పదవులు, టికెట్లు ఇస్తేనే పనిచేస్తామనే వారు తన వద్దకు రావద్దని నిర్మోహమాటంగా తెలిపారు. ఎవ్వరు ఉన్నా లేకున్నా ఒక్కడినే పార్టీని ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ధైర్యం ఉందని చెప్పారు.