వేల కోట్ల సబ్సిడీ బ్యాంకుల పాలు

Published: Monday November 19, 2018
ప్రజా సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తున్నా అవి ప్రజలకు చేరడం లేదు. బ్యాంకు మేనేజర్ల నిర్లక్ష్యం... రుణాలు ఇవ్వడంలో నిర్లిప్తత వెరసి ప్రజలకు చేరాల్సిన వేల కోట్ల సొమ్ము బ్యాంకు ఖాతాల్లోనే మూలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకుల మేనేజర్లు à°—à°‚à°¡à°¿ కొడుతున్నారు. వారి సహకారలేమితో సంక్షేమ పథకాల అమలు నత్తనడకన సాగుతోంది. బ్యాంకుల బ్రాంచ్‌ మేనేజర్లు సబ్సిడీ రుణాలిచ్చేందుకు ససేమిరా అంటుండడంతో ప్రభుత్వం విడుదల చేసిన వేల కోట్ల సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. దీనిని సర్కారు సీరియ్‌సగా తీసుకుంది. ఆయా పథకాలకు సంబంధించి రుణాల మంజూరుకు చివరి తేదీ ముగిసినప్పటికీ బ్యాంకుల తీరు మారకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో సబ్సిడీ రుణాలు ఎందుకు మంజూరు చేయడంలేదో కారణాలు వివరిస్తూ... తమ సబ్సిడీ సొమ్మును తిరిగిచ్చేయాలని బ్యాంకులను కోరింది.
 
ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేవంలో ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లకు à°ˆ మేరకు హెచ్చరికలు చేశారు. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ.3,661 కోట్ల సబ్సిడీ సొమ్ము ఉంది. ఇందులో 2,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానివి కాగా... మిగిలినవి దానికి ముందు రెండు ఆర్థిక సంవత్సరాలకు చెందినవి. సబ్సిడీ రుణాలు అత్యధికంగా ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్‌, సిండికేట్‌, ఏపీజీబీ, ఏపీసీవోబీ బ్యాంకుల్లో ఉన్నాయి. 2016-17లో రాష్ట్రం విడుదల చేసిన సబ్సిడీలో 81 శాతం రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయి. 2017-18లో కేవలం 65 శాతం రుణాలు మాత్రమే బ్యాంకులు విడుదల చేశాయి. సబ్సిడీ రుణాలు, లబ్ధిదారులకు సంబంధించిన వివరాలన్నింటినీ బ్యాంకులు ప్రభుత్వానికి అందజేయడం లేదు.
 
రుణాల మంజూరు వివరాలివ్వని బ్యాంకులు
అర్హులైన వారిందరికీ సబ్సిడీ రుణాలు అందుతున్నాయా లేదా అనే అంశాన్ని ట్రాక్‌ చేసేందుకు ప్రభుత్వం à°’à°• రీపేమెంట్‌ ట్రాకర్‌ను రూపొందించింది. à°ˆ ట్రాకర్‌ను వినియోగించుకునేందుకు బ్యాంకులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వివరాలు అందజేయడం లేదు. కాబట్టి, పథకాల పటిష్ట నిర్వహణకు బ్యాంకులు సహకరించాలని వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేయాలని ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ప్రభుత్వాధికారులు కోరారు. సీఎ్‌ఫఎంఎస్‌ వచ్చాక ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు చాలా వరకు పారదర్శకంగా జరుగుతున్నాయి. సీఎ్‌ఫఎంఎ్‌సకి ముందు పంచాయతీల నుంచి డైరెక్టరేట్ల వరకు ప్రభుత్వోద్యోగులు వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వీటి సంఖ్య కొన్ని వేలల్లో ఉంది. ఇందులో అవసరమైనవి ఉంచి, అనవసరమైన వాటిని తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నింటినీ సీఎ్‌ఫఎంఎ్‌సతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బ్యాంకుల కోసం à°’à°• ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేసింది. à°ˆ మేరకు అన్ని బ్యాంకులు తమ బ్యాంకుల్లో పంచాయతీ స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న ప్రభుత్వ ఖాతాల వివరాలను ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌తో సహా తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.