15 లఘుచిత్రాలతో జనం వద్దకు..

Published: Tuesday November 20, 2018
 à°¨à±‡à°°à°‚ రూపం మారుతోంది. మాయ కొత్త మార్గాలు చూసుకుంటోంది. నిన్న, మొన్నటి స్నేహం నిలువునా మోసం చేస్తోంది. ఆగంతకుల ఫోన్‌ సంభాషణలు ఖాతాలను కొల్లగొట్టేస్తునాయి. ఫేస్‌బుక్‌ పరిచయం సామాజిక వేదికగా పరువు తీసేస్తోంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న నేరాల తీరు. à°ˆ నేరాలపై అవగాహన కల్పించి, వాటి నియంత్రణ చైతన్యాన్ని పునాదుల్లోంచి తీసుకువచ్చే ప్రయత్నంలో ప్రజలకు పోలీసులు ‘చేరువ’ అవుతున్నారు. దీనికోసం పోలీసు శాఖ ‘చేరువ’ పేరుతో ప్రత్యేక వాహనాలను రోడ్డెక్కించింది. వీధివీధిలో లఘుచిత్రాలను ప్రదర్శిస్తోంది. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం రెండు వాహనాల్లో ప్రజలబాట పడుతున్నారు. ఒక్కో నేరానికి à°’à°• లఘచిత్రం చొప్పున మొత్తం 15 రకాల లఘుచిత్రాలను వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు.
 
ఎల్‌ఈడీ స్ర్కీన్లు, ఎల్‌సీడీ టీవీల్లో లఘు చిత్రాలను గల్లీగల్లీల్లో ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థలపైనే ‘చేరువ’ రథాలు కేంద్రీకరించాయి. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో విద్యార్థినులను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌లను దృశ్యరూపంలో వివరిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రతి రోజూ à°’à°• గంటపాటు ప్రదర్శిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు, హెల్మెట్‌ వాడకం, డ్రంకెన్‌ డ్రైవ్‌, ఈవ్‌టీజింగ్‌ అంశాలపై తయారు చేసిన వీడియోలను ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రదర్శిస్తున్నారు. ఈవ్‌టీజింగ్‌à°•à°¿ గురయినప్పుడు డయల్‌ 100, మహిళా రక్షక్‌లకు ఎలా సమాచారం ఇవ్వాలన్న అంశాలను సోదాహరణంగా చెబుతున్నారు.
 
విజయవాడ పోలీస్‌ కమిషనట్‌ పరిధిలో మొత్తం 21 ఠాణాలుండగా, చేరువ వాహనాలను రోజుకు ఒక్కో పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో తిప్పుతున్నారు. ఆయా ఠాణాల పరిధిలో à°—à°² వాణిజ్య ప్రాంతాలను, నివాసిత ప్రదేశాలను, గేటెడ్‌ కమ్యూనిటీలను కేటగిరీలు విభజించుకుని à°ˆ వాహనాలను తీసుకెళ్తున్నారు. ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) ఎలా సైబర్‌ నేరగాళ్లకు చిక్కుతుంది, ఏవిధంగా వారు ఫోన్లు చేస్తారు, బ్యాంక్‌ అధికారులు ఫోన్లు చేసిన ఖాతాదారులను పిన్‌ నెంబర్లు, సీవీవీ నంబర్లు అడుగుతారా, ఒకవేళ ఈవిధంగా ఫోన్లు వస్తే ఎలా స్పందించాలి అన్న విషయాలతో కూడిన లఘుచిత్రాలను ప్రదర్శిస్తున్నారు.