రోజురోజుకూ దిగజారుతున్న ధర

Published: Thursday November 22, 2018
దిగుబడి తగ్గితే ధర పెరుగుతుంది. దిగుబడి పెరిగితే ధర తగ్గుతుంది... ఇది సాధారణ మార్కెట్‌ సూత్రం. పత్తి కొనుగోళ్ల విషయంతో à°ˆ సూత్రం తిరగబడింది. రాష్ట్రంలో.. దేశంలో పత్తి దిగుబడి పడిపోయినా.. ధర మాత్రం పెరగడం లేదు సరికదా.. రోజు రోజుకూ తగ్గిపోతోంది. మూడు నాలుగు వారాల కిందట రూ.5,900 ధర పలికిన క్వింటా పత్తి ఇప్పుడు 4,800కు పడిపోయింది. ధరలు పతనమై రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వారిని ఆదుకోవల్సిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) మీనమేషాలు లెక్కిస్తోంది. మార్కెటింగ్‌శాఖ తాత్సారం వల్ల సీసీఐ రంగంలోకి దిగడంలో జాప్యం చేస్తోంది. రాష్ట్రంలో à°ˆ ఏడాది 5.67 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. హెక్టారుకు సగటున 1863 కిలోల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీని ప్రకారం 10.56 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి రావాలి. గతేడాది హెక్టారుకు సగటున 1654 కిలోల దిగుబడి వచ్చింది. à°ˆ ఏడాది 209 కిలోల దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఎకరానికి 12-15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన పత్తి వర్షాభావం వల్ల ఆరేడు క్వింటాళ్లే వస్తోంది. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో à°ˆ మాత్రం కూడా రాకపోవచ్చని అంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలోనే కాస్త దిగుబడి కన్పిస్తోంది. మరో పక్షం రోజుల్లో వర్షాలు పడితే ఒకటో రెండో క్వింటాళ్లు దిగుబడి రావచ్చని రైతులు చెబుతున్నారు. మూడు నాలుగు వారాల కిందటి వరకూ క్వింటా పత్తి రూ.5,700 నుంచి రూ.5,900 ధర పలికింది. దీంతో à°ˆ ఏడాది సీసీఐ రంగంలోకి రావాల్సిన పనిలేదని అంతా భావించారు. అయితే పత్తి విత్తనాల మార్కెట్‌ తగ్గిందని, పత్తిలో నెమ్ము శాతం ఎక్కువగా ఉందని చెబుతూ వ్యాపారులు కొర్రీలు వేస్తున్నారు. రోజు రోజుకూ ధర తగ్గించేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం క్వింటా పత్తి రూ.4,800 నుంచి రూ.5వేల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ధర తగ్గుతున్నా సీసీఐ అధికారులు నోరు మెదపడం లేదు.
 
ఖరీఫ్‌ పూర్తయి ఆరు వారాలు గడిచింది. ఇంతవరకు ఖరీ్‌ఫలో వేసిన పంటలను à°ˆ క్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేసి ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయలేదు. రాష్ట్రంలో 2014-15లో జరిగిన సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిలో అనేక మార్పులు ప్రవేశపెట్టాయి. మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం à°ˆ పంటల నమోదును పూర్తిచేసి మార్కెట్‌ యార్డులకు à°† జాబితాను అనుసంధానం చేయలేదు. à°ˆ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు మూడు వారాలు పడుతుందని చెబుతున్నారు. à°ˆ క్రాప్‌ బుకింగ్‌లో పేరు లేకపోతే రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఇటువంటి సాంకేతిక సమస్యలు వచ్చిన సమయంలో సాగు ధృవీకరణ పత్రం (క్రాప్‌ కల్టివేషన్‌ సర్టిఫికెట్‌- సీసీసీ) ఇచ్చారు. దాని ఆధారంగా గుంటూరు యార్డులో మిర్చి, దుగ్గిరాల, à°•à°¡à°ª, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పసుపు కొనుగోలు చేశారు. ప్రస్తుతం సాగు ధ్రువీకరణ పత్రాలను ప్రవేశపెట్టి.. సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.
 
కనీస మద్దతు ధర క్వింటా రూ.5,450à°•à°¿ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మార్కెట్‌ యార్డుల్లో à°ˆ క్రాప్‌ బుకింగ్‌ వివరాలు లేవు. వ్యవసాయ శాఖ అధికారులు ఇంతవరకు à°ˆ క్రాప్‌ బుకింగ్‌ వివరాలను అందజేయలేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మార్కెటింగ్‌ శాఖ మౌలిక వసతులను కల్పించలేదు.