హాయ్‌ల్యాండ్‌పై అగ్రిగోల్డ్‌ నాటకం

Published: Friday November 23, 2018
అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రధాన ఆశగా నిలిచిన ‘హాయ్‌ల్యాండ్‌’పై భారీ డామ్రా నడిచినట్లు తెలిసింది. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం... హాయ్‌ల్యాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అల్లూరి వెంకటేశ్వరరావుతో ‘దొంగ’ అఫిడవిట్‌ దాఖలు చేయించినట్లు సమాచారం. à°ˆ విషయాన్ని అల్లూరి సీఐడీ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. హాయ్‌ల్యాండ్‌పై పితలాటకానికి తెరలేపిన నేపథ్యంలో ఆయనను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హైకోర్టు ఆదేశాల మేరకు హాయ్‌ల్యాండ్‌ను వేలంలో విక్రయిస్తే తక్కువ డబ్బులే వస్తాయని, అసలు అది ‘అగ్రిగోల్డ్‌’ ఆస్తికాదని చెబితే పూర్తిగా మిగిలిపోతుందని చైర్మన్‌ అవ్వారు వెంకట రామారావు ఆలోచించారు. ఏలూరు జైలులో ఉన్న ఆయన వద్దకు అల్లూరి వెంకటేశ్వరరావును సంస్థ టెక్నికల్‌ అడ్వైజర్‌ రవికాంత్‌ తీసుకెళ్లారు.
 
ములాఖత్‌లో భాగంగా వీరు కలిశారు. ‘‘హాయ్‌ల్యాండ్‌ ఎంతో ఖరీదైన ఆస్తి! వేలంలో తక్కువ ధరకే పోతుంది. అందుకే... హాయ్‌ల్యాండ్‌ మాది కాదని మేం చెబుతాం. అది మీదేనని కోర్టులో పిటిషన్‌ దాఖలు చెయ్‌’’ అని వెంకటరామారావు సూచించారు. నిజానికి... వెంకటేశ్వరరావు హాయ్‌ల్యాండ్‌లో à°’à°• ఉద్యోగి మాత్రమే. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఆయన à°Žà°‚à°¡à±€ హోదాలో నెలకు రూ.70వేల జీతం తీసుకుంటున్నారు.
 
ప్రజల నుంచి వందలకోట్ల డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్‌ యాజమాన్యం... à°† సొమ్ముతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసింది. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు à°† ఆస్తుల వివరాలన్నీ రాబట్టారు. అగ్రిగోల్డ్‌తోపాటు చైర్మన్‌, డైరెక్టర్లు, వారి బినామీల ఆస్తులను సైతం జప్తు చేశారు. అందులో... విజయవాడ-గుంటూరు మధ్య, చినకాకాని వద్ద వందల కోట్ల రూపాయల విలువైన హాయ్‌ల్యాండ్‌ కూడా à°’à°•à°Ÿà°¿. ఇది అర్కా లీజర్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట రిజిస్టర్‌ అయ్యింది. దీంతో... హాయ్‌ల్యాండ్‌ ‘అర్కా’ సంస్థదని, అగ్రిగోల్డ్‌ది కాదనేలా అల్లూరి వెంకటేశ్వరరావు పేరిట హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలైంది. ఇది ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. దీంతో కలవరపడిన అల్లూరి వెంకటేశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్నాళ్లు తిరుపతిలో మకాం వేశారు. తిరిగి తన స్వగ్రామం రేపల్లెకు చేరుకున్న ఆయనను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.