నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల సర్వేలు...

Published: Monday November 26, 2018
గుంటూరు జిల్లాలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎక్కడికక్కడ ఆశావహులు అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సర్వేల మీద సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, నియోజకవర్గాల వారీగా ముక్కు, ముఖం తెలియనివారు బృందాలుగా విడిపోయి శాస్త్రీయ పద్ధతిని విస్మరించి సర్వేలు చేస్తుండడం గమనార్హం! అభిప్రాయాలు అనుకూలంగా ఉంటే à°’à°• à°°à°•à°‚à°—à°¾, లేకుంటే మరోరకంగా సామాజిక మాధ్యమాల్లో పెట్టే సాహసం చేస్తున్నారు. మరికొన్ని బృందాలైతే ఇష్టమొచ్చినట్లుగా చానళ్ళు, పత్రికల పేర్లను వాడుకుంటున్నాయి. à°ˆ మధ్యనే ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధి లాల్‌పురంలో తిరుగుతున్న బృందాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. వారు సర్వే పేరుతో తమ ఓట్లు తొలగిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసి వీరిని నేరుగా పోలీసులకు అప్పగించారు.
 
ఇప్పటికే కొన్ని సర్వేలు...
పార్టీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు, సిట్టింగులకు సర్వేలు సంకటంగా మారాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటికే జిల్లాలో దాదాపు 5 సర్వేలు నిర్వహించినట్లు చెబుతున్నారు. వైసీపీ తరపున ఇంతకుముందే పీకే టీమ్‌ నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి నివేదికలను పార్టీకి అందించింది. బీజేపీ, జనసేనలు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో సర్వేల పేరిట ఎడాపెడా వస్తున్న అంచనాలు అందరినీ కలవరపెడుతున్నాయి.
 
సైకిల్‌ సర్వే సవారీ...
‘పార్టీలో గెలుపొందే వారికే ఈసారి సీట్లు కేటాయిస్తాం.. .à°’à°• నిర్దిష్ట పద్ధతిని పాటిస్తాం... మొహమాటాలకు పోయి, మరేదో ఫలితం కొని తెచ్చుకోకముందే జాగ్రత్త పడుతున్నాం... ఇప్పటి వరకు ఐదు సర్వేలు పూర్తయ్యాయి. వాటి నివేదికల ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే వారిని ఎంపిక చేస్తాం...’ అంటూ à°ˆ మధ్య టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్పష్టంగా చెప్పారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుందో స్పష్టం చేశారు. ఇది క్షేత్రస్థాయిలో కొందరికి ఆందోళన కలిగిస్తోంది. కొందరికి సీటు చేజారుతుందనే సంకేతాలు వెలువడుతుండగా... ఇంకొందరికి ఖాయమనే ధీమానిస్తోంది.
 
 
ఎన్నికల సమరానికి టీడీపీ పూర్తిగా సమాయత్తమైంది. ఒకవైపు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తూనే మరోవైపు జిల్లాల్లో ఎవరిని రంగంలోకి దింపితే గెలుపు ఖాయమనే విషయంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. అధికారికంగా, పార్టీపరంగా నిఘా బృందాలను రంగంలోకి దింపింది. ఆ బృందాలు ఇచ్చే నివేదికలను బట్టి పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది.
 
వైసీపీదీ అదే తీరు...
కొంతకాలం వరకు పీకే టీమ్‌ సర్వే ఆశావహులను కాస్త ఇబ్బంది పెట్టింది. పార్టీ సీనియర్లు సైతం కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి à°† సర్వేనే ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రస్తుతమైతే à°† ఊసు పెద్దగా లేదు. ఇప్పుడు ఆర్థికంగా బలవంతుల కోసం వైసీపీ అన్వేషణ ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. సర్వే నివేదికతోపాటు ఆర్థిక స్థోమతలను అంచనా వేస్తోంది. ఆర్థిక స్థోమత à°—à°² అభ్యర్థులను బరిలోకి దింపితేనే అనుకున్న ఫలితాలు సాధిస్తామనే నిర్ణయానికి à°† పార్టీ వచ్చేసిందని సమాచారం. ఇప్పటికే జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ ఇన్‌చార్జిలను మార్పు చేశారు. ఇంకొన్ని మార్పులు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.
 
సై అంటున్న బీజేపీ, జనసేన...
జీజేపీ, జనసేనలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగాలనే ఆలోచనలో ఉన్నాయి. అయితే, ఆయా నియోజకవర్గాల్లో తగిన అభ్యర్థుల ఎంపిక à°…à°‚à°¤ సులభమేమీకాదని భావిస్తున్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. à°† పార్టీలకు అనుకూలంగా పనిచేసే సంఘాలన్నీ ఇప్పటికే జిల్లా అంతటా తిరిగి à°’à°• అంచనాకు వస్తున్నాయని సమాచారం. జిల్లాలోని 17 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సర్వేలపై ఆధారపడుతున్నాయి.