2- 5 డిగ్రీలు తగ్గుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

Published: Tuesday November 27, 2018
కోస్తాలో చలి ఒక్కసారిగా పెరిగింది. ఉత్తరాది నుంచి మధ్యభారతం మీదుగా కోస్తా, తెలంగాణ వరకు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌కు ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. సోమవారం విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో 5.2డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సమీపంలోని లంబసింగిలో 3-4డిగ్రీల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఇక్కడ ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తోంది. చలి తీవ్రతకు కాఫీ పండ్ల సేకరణకు వెళుతున్న కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడున్నారు.
 
తరగతి గదిలో చలి ఎక్కువగా ఉండటంతో లంబసింగి బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం 2à°—à°‚à°Ÿà°² సమయంలోనూ ఆరుబయట ఎండలో కూర్చుని పరీక్షలకు చదువుకుంటున్నారు. కాగా, రానున్న రెండు, మూడు రోజుల్లో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు ఆర్‌.మురళీకృష్ణ తెలిపారు. బంగాళాఖాతంలో తుఫాన్‌, తరువాత అల్పపీడనం ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో తమిళనాడు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. à°† తరువాత సముద్రంలో ఎటువంటి అల్పపీడనాలు, తూర్పుగాలుల ప్రభావం లేదు. దేశవ్యాప్తంగా కూడా వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. తమిళనాడు, కేరళల్లో తప్ప మిగిలినచోట్ల ఆకాశం నిర్మలంగా ఉంది.