ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు

‘‘తెలంగాణలో 7న జరిగే ఎన్నికల్లో అక్కడ స్థిరపడిన సీమాంధ్రులు కుల, మత, ప్రాంత ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఆత్మసాక్షిగా... నీతి, నిజాయితీ ఉన్న నాయకులకు ఓటు వేయాలి’’ అని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. విజయవాడలో బుధవారం మాట్లాడుతూ, ‘‘ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న నేతలు ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. విభజన తర్వాత అక్కడ తెలంగాణ, సీమాంరఽధుల మధ్య ఎలాంటి విద్వేషాలు రేగలేదు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పడం వల్ల అక్కడి స్థానికుల్లో ఒక విధమైన భావన ఏర్పడే అవకాశం ఉంది. విభజన సమయంలో కోదండరాం ఆంధ్రులను దూషించారు. విభజన తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చి నవ్యాంధ్ర మరో మూడు ముక్కలు కావాలని వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ నమ్మించి మోసం చేస్తే, ఆ హామీలను నెరవేర్చుతానని బీజేపీ మోసం చేసింది. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులు బీజేపీని దారుణంగా ఓడించాలి’’ అని చలసాని పిలుపునిచ్చారు.

Share this on your social network: