కేసీఆర్‌ ఫ్లెక్సీల ఏర్పాటుచేసిన వైసీపీ, జనసేన

Published: Thursday December 13, 2018
 à°¤à±†à°²à°‚గాణలో టీఆర్‌ఎస్‌ గెలుపును రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు తమ విజయంగా జరుపుకోవడం కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అభినందనలు తెలుపుతున్న ఫ్లెక్సీ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని à°† పార్టీ కార్యాలయం ఎదుట వెలిసింది. టీడీపీ నేత కింజరపు ఎర్రంనాయుడు, తాండ్ర పాపారాయుడుల పక్కన కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌, కవితల ఫొటోలతో అక్కడే మరో ఫ్లెక్సీ కనిపించింది. వైసీపీ అఽధినేత జగన్‌ను వరంగల్‌ జిల్లాలోకి అడుగుపెట్టకుండా కేసీఆర్‌ బృందం అడ్డుకొన్న ఘటనను కొందరు గుర్తుచేశారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెంలో వైసీపీ యూత్‌ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
 
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో నూ కేసీఆర్‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని పైడిపర్రు గ్రామంలో కేసీఆర్‌, పవన్‌ కల్యాణ్‌ ఫొటోలతో జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వెలమ యువజన సంఘం కార్యకర్తలు కేసీఆర్‌ని కీర్తిస్తూ ర్యాలీ తీసి.. దుర్గామల్లేశ్వరి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్తరాంధ్రలో కుటుంబ మూలాలు వున్న కేసీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా తాము సంబరాలు నిర్వహిస్తున్నామని కిల్లాడ సత్యనారాయణ అనే వైద్యులు తెలిపారు.