రాష్ట్రంపై రాజకీయ కుట్రలా?

Published: Thursday December 27, 2018
 ‘‘అశాస్ర్తీయంగా విడగొట్టిన రాష్ర్టానికి న్యాయం చేయాలని అడిగాం. రాష్ట్ర విభజన తరువాత ఏపీని అభివృద్ధి చేస్తారని, కొత్త రాష్ట్ర రాజధానితోపాటు ప్రత్యేక హోదా ఇస్తారని ఎన్‌డీఏతో కలిసి పనిచేశాం. నాలుగేళ్లు చూశాం. న్యాయం జరగలేదు. రాష్ర్టాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరాం. చేయలేదు. అందుకే నిలదీసి అడిగాం. న్యాయం అడిగితే అణగదొక్కుతారా?’’ అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసాన్ని ఎండగట్టే క్రమంలో వరుసగా నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్షలకు బుధవారం అనంతపురం నగరం వేదిక అయింది. రాష్ట్ర విభజన తరువాత కేంద్రంపై భరోసాతో కొత్త రాజధాని నిర్మాణాన్ని చేపట్టామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి పనులు ప్రారంభించామని చంద్రబాబు à°ˆ సందర్భంగా వివరించారు. విభజన కష్టాలు, రెవెన్యూ లోటు ఉన్నా అభివృద్ధినీ, సంక్షేమాన్నీ విస్మరించకుండా ముందుకు వెళ్లి, మంచి ఫలితాలను సాధించామన్నారు.
 
రాష్ట్రం ఇలా వేగంగా అభివృద్ధి చెందడం చూసి ప్రధాని నరేంద్రమోదీ ఓర్వలేకపోయారని, అభివృద్ధిలో గుజరాత్‌ని మించిపోతామన్న కారణంగానే సహకరించలేదని ఆగ్రహించారు. ‘‘రాష్ర్టాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నేను 29 సార్లు ఢిల్లీకి వెళ్లాను. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడిని మిస్టర్‌ క్లింటన్‌ అని పిలిచిన నేను, మోదీ అమరావతికి వచ్చినపుడు సార్‌.. అని పిలిచాను. అయినా ఆయన మారలేదు. పైగా కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇది రాష్ట్రంపై కుట్ర కాదు. తెలుగు జాతిపై కుట్ర. చరిత్రను పరిశీలిస్తే తెలుగోడితో పెట్టుకున్నవారెవరూ గట్టెక్కలేదు’’ అని హెచ్చరించారు. కట్టుబట్టలతో హైదరాబాద్‌ను వదిలిపెట్టిన రోజున, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పథకాలు, పింఛన్ల విషయంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, à°† గడ్డు పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సాయంతో అధిగమించే ఆలోచనతోనే నాడు ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్నామన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని తిరుప తి ఎన్నికల సభలో హామీ ఇచ్చి.. à°† తరువాత మోదీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు మోదీ ప్రసంగం ఆడియోను ధర్మపోరాట దీక్ష వేదికపై ప్రదర్శించారు. à°ˆ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే..