సమస్యను మరింత జటిలం చేస్తారా!

Published: Sunday December 30, 2018
ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు... ఇలా మూకుమ్మడిగా రెవెన్యూ శాఖపై విరుచుకుపడ్డారు! ‘మీ నిర్వాకంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చుక్కల భూములు, నిషేధ భూముల సమస్యకు పరిష్కారం చూపడంలేదు. పైగా... సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. దశాబ్దాలతరబడి ఉన్న కాలనీలను, ఊరూ వాడను కూడా నిషేధ జాబితాలో చేర్చేశారు’’ అంటూ ధ్వజమెత్తారు. నిషేధ భూముల సమస్యను... ఉదాహరణలతో సహా వివరించారు. రెవెన్యూ ఉత్తర్వుల వల్ల అనేక సమస్యలొచ్చాయని మంత్రులు, సీనియర్‌ అధికారులు సూటిగా చెప్పారు. వారి వాదనతో ముఖ్యమంత్రి కూడా ఏకీభవించారు. అప్పటికప్పుడు... భూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు à°ˆ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. భూ సమస్యలు పరిష్కారం కాకుండా మరింత జటిలం చేస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలను సమీక్షించి సులభతరమైన విధివిధానాలను తీసుకురావడంతోపాటు... సమస్యాత్మక ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం, పలు చట్టాలను సవరించడం వంటి అంశాలను à°ˆ ఉపసంఘం పరిశీలిస్తుంది.
 
శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు à°ˆ నిర్ణయం తీసుకున్నారు. ఉపసంఘం పనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయాలని ఆయన ఆదేశించారు. నిషేధ భూముల జాబితా à°•à°¿à°‚à°¦ వచ్చిన దరఖాస్తుల్లో 50వేల దరఖాస్తులను పరిష్కరించామని, కేవలం 1229 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. జనవరి 28 నాటికి అన్నీ పరిష్కరిస్తామని సీఎంకు నివేదించారు. à°ˆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర జోక్యం చేసుకొని... ఎస్‌ఎల్‌ఏలో పెండింగ్‌లో ఉన్న వాటిని ఇష్టానుసారంగా తిరస్కరిస్తున్నారని తెలిపారు. ‘‘2015-16కు ముందు à°ˆ సమస్య లేదు. 2016లో తీసుకొచ్చిన à°“ ఆర్డర్‌ వల్ల నిషేధ భూముల జాబితా పెరిగిపోయింది. à°ˆ ఉత్తర్వు వల్ల వేలాది మంది బాధితులుగా మారిపోయారు. à°† ఉత్తర్వును సమీక్షించాలి’’ అని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి జోక్యం చేసుకొని... ప్రజల భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని, వాటి పరిష్కారంలో ఇంకా తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు.