‘చంద్రబాబు వెన్నంటే నూర్‌బాషాలు’

Published: Thursday January 03, 2019

విజయవాడ: à°®à±à°–్యమంత్రి చంద్రబాబునాయుడు నూర్‌బాషా కార్పొరేషన్‌కు రూ.12కోట్లు విడుదల చేయటంపై రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, నూర్‌బాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగుల్‌ మీరా హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారని, అందులో దూదేకుల ముస్లింలు ఇంకా వెనుకబడి ఉన్నారని తెలిపారు. వృత్తిమీద ఆధారపడిన వారిలో సగభాగం దూదేకుల ముస్లింలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మైనార్టీ కార్పొరేషన్‌కు అనుబంధంగా నూర్‌బాషాల కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి రూ.40 కోట్లు కేటాయించడమే కాకుండా తొలివిడతగా రూ.12కోట్లను విడుదల చేయటం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు వెంట దూదేకుల ముస్లింలు ఉంటారన్నారు. చంద్రబాబు తమ వర్గానికి రాజకీయరంగంలో ప్రముఖ స్థానం కల్పించారన్నారు.