దారీతెన్నూ లేని స్థితికి వెళ్లిపోతాం

Published: Saturday January 05, 2019
కోడి కత్తి జగన్‌పై మోదీ సీబీఐ కత్తి పెట్టడంతో ఆయన ప్రధానికి à°Šà°¡à°¿à°—à°‚ చేయడానికి సిద్ధపడుతున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధిలో తనతో పోటీపడలేని తెలంగాణ సీఎం కేసీఆర్‌.. జగన్మోహనరెడ్డికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అక్కడ మిగిలిపోయిన గడియారాలను ఇక్కడ పంచడానికి ఆయనకు పంపారని దుయ్యబట్టారు. శుక్రవారం కాకినాడ జేఎన్టీయూకే క్రీడా మైదానంలో 6à°µ విడత జన్మభూమి-మా ఊరు సభలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన జన్మభూమిలో ఆరవ విడత జన్మభూమికి బాగా స్పందన వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. à°ˆ సందర్భంగా నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. జగ్గంపేట బహిరంగ సభలో కూడా మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజల శాశ్వత ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.
 
‘నాలుగున్నరేళ్ల పాటు కష్టాలను à°­à°°à°¿à°‚à°šà°¿ రాష్ట్రాన్ని ట్రాక్‌లోకి తెచ్చాను.. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను.. మీరు పూర్తిగా à°…à°‚à°¡à°—à°¾ ఉంటే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుంది.. అభివృద్ధి, సంక్షేమాల్లో కూడా అగ్రస్థానంలో ఉంటాం. మళ్లీ నన్ను ఆశీర్వదించండి. కోడి కత్తి పార్టీ మాట వింటే మళ్లీ దారీతెన్నూలేని స్థితికి వెళ్లిపోతాం. ప్రజలకు న్యాయం చేసే నేనే ఓడిపోతానంటే.. మోదీకి డిపాజిట్లు వస్తాయా..? ఆయన వల్ల ఎన్నో కష్టాలు వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు, బ్యాంకుల దివాలా, జీఎస్టీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. రూపాయి విలువ పడిపోవడం.. ఇన్ని ప్రజావ్యతిరేక పనులు చేసిన మోదీ వల్ల మనకేమైనా మేలు జరిగిందా? రాఫెల్‌లోనూ అవినీతికి పాల్పడ్డారు. ఆయన డైరెక్టుగా ఐటీ, ఈడీలతో మంత్రులు, ఎంపీలపై దాడులు చేయిస్తున్నారు’ అని విరుచుకుపడ్డారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాను వేసిన నిజనిర్థారణ కమిటీ ద్వారా రాష్ట్రానికి రావాలని తేల్చిన రూ.75 వేల కోట్ల కోసం కేంద్రంపై పోరాడాలని సూచించారు. ఇంకా ఏమన్నారంటే..
 
ఇలాంటి కట్టడాలు జీవితంలో చూడలేం
‘పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ఇప్పటికే 64 శాతం పనులు పూర్తయ్యాయి. జీవితంలో ఇక ఎక్కడా ఇటువంటి కట్టడాలు చూడలేం. కట్టే పరిస్థితి కూడా ఉండదు. పెద్ద ప్రాజెక్టులలో ఇదే చివరి ప్రాజెక్టు. మీరంతా వెళ్లి ఒక్కసారైనా చూడండి. ఇది పూర్తయితే గోదావరి జిల్లాల్లో కరువు ఉండదు. రెండు పంటలకూ నీరొస్తుంది. గోదావరి జలాలు ఏటా 2,500 టీఎంసీల నుంచి 3,000 టీఎంసీల వరకు సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఉపయోగించుకుంటే à°ˆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుంది. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. పురుషోత్తపట్నం రెండో దశను ప్రారంభించాం. దీని ద్వారా 67,614 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందుతుంది. 24 టీఎంసీల నీరు ఏలేరు రిజర్వాయర్లో నిల్వ ఉంటాయి. రాజమహేంద్రవరం రూరల్‌, ప్రత్తిపాడు, తుని, పిఠాపురం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి. ఏలేరు రిజర్వాయర్‌పై ఇంకా కొన్ని ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నాం.
 
రూ.50 కోట్లతో మల్లవరం, రూ.32 కోట్లతో గోవిందపురం, రూ.50 కోట్లతో మొల్లేరు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తాం. ఏలేరు ప్రధాన కాలువ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. దీనిని పూర్తి చేసే బాధ్యత నాదే. చెప్పింది, చేసింది చెప్పుకొనే ధైర్యం టీడీపీ ప్రభుత్వానికే ఉంది. వ్యవసాయానికి 10 à°—à°‚à°Ÿà°² పాటైనా విద్యుత్‌ సరఫరా చేస్తాం. ప్రతి రైతుకు సోలార్‌, ఎనర్జీ సేవింగ్‌ పంప్‌ సెట్లు పంపిణీ చేస్తాం. వారి వద్ద మిగిలిన విద్యుత్‌ను యూనిట్‌ రూ.1.50à°•à°¿ కొనుగోలు చేస్తాం. పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ, వాహనాలకు, పరిశ్రమలకు గ్యాస్‌ సరఫరాకు శ్రీకారం చుట్టాం. జిల్లాలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్మాణం ప్రారంభించాం. ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి వేస్తాం. ఏజెన్సీలో వ్యాధులను అదుపు చేశాం. కౌశల్‌ గోదావరి ద్వారా 52,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. కాకినాడను కమర్షియల్‌ పోర్టుగా అభివృద్ధి చేస్తున్నాం.’