గుంటూరులో అయ్యప్పలు భారీ నిరసన ర్యాలీ...

Published: Sunday January 06, 2019
రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని అయ్యప్ప సేవా సమాఖ్య అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ ఆరోపించారు. అయ్యప్ప సేవా సమాఖ్య అయ్యప్ప దీక్షాస్వాముల ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిరసన ర్యాలీ, మానవహారం, రాస్తారోకో నిర్వహించారు.
 
 
à°ˆ సందర్భంగా.. సిరిపురపు శ్రీధర్‌ మాట్లాడుతూ జల్లికట్టుకు à°“ న్యాయం... అయ్యప్పకు à°“ న్యాయమా అని ప్రశ్నించారు. మత విశ్వాసాలు దెబ్బతినేలా కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నారన్నారు. శబరిమల అయ్యప్ప ఆచార వ్యవహారాల్లో సుప్రీం కోర్టు తీర్పుపై ఇంతవరకు మోదీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టకుండా ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని, à°ˆ విధానాన్ని మానుకోవాలని ఇప్పటికే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని దీనిపై తక్షణమే కేంద్రం చర్యలు చేపట్టకపోతే హిందూ ధర్మ వాదులందరు తగురీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. à°ˆ కార్యక్రమంలో గురు స్వాములు కుందుర్తి భాస్కర్‌, యు.మధుస్వామి, మర్రిపాటి ప్రసాద్‌, కృష్ణమూర్తి, పూర్ణ, సూర్యనారాయణ, బ్రహ్మానంద తదితరులు పాల్గొన్నారు.