మోదీ డైరెక్షన్‌లోనే కేటీఆర్ బృందం చర్చలు
Published: Thursday January 17, 2019

‘ప్రధాని మోదీకి బీ టీం, కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌తో ఏపీలో వైఎస్ జగన్ పొత్తు పెట్టుకుంటే పాతాళానికి పోతా రు. మోడీ డైరెక్షన్‌లో కెసీఆర్ నడుస్తున్నారు. కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్ నడవబోతున్నారు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మోదీకి అనుకూలంగా వ్యవహరించాలనే ఎజెండాతోనే వైఎస్ జగన్‌తో కేటీఆర్ బృందం చర్చలు జరిపింది. ముసుగు తొలగించుకుని మోదీతో జతకడుతున్నట్లు ఇద్దరూ ఓపెన్‌గా చెప్పాలి. ప్రజల్ని మోసం చేయవద్దు. కేసీఆర్, జగన్.. ఇద్దరూ మోదీ జట్టులోని ఆటగాళ్లే. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీల ప్రయోజనాలపై మాట్లాడటం హాస్యాస్పదం గా ఉంది. తెలంగాణాలో దొరలకు సేవచేస్తూ ఇక్కడ జగన్‌కు సేవ చేయమని యాదవులకు, బీసీలకు చెప్పడానికి తలసాని రాయబారిగా వచ్చారు. కోడి పందేలు చూడటానికి వచ్చిన తలసాని బీసీలు ఎవరితో పోరాడాలో చెప్పలేకపోయారు. మోదీని విమర్శించే దమ్ము లేని జగన్ హోదా గురించి ఎవరితో పోరాడుతున్నారో చెప్పాలి. జగ న్ చెల్లెలు షర్మిలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిపై సీఎం ఎందుకు స్పందించరు? కేసు తెలంగాణాలో పెట్టారని తప్పుకోకుండా ఇక్కడ కూడా దర్యాప్తునకు ఆదేశించాలి. ఇక్కడ బ్రహ్మాండమైన ప్రభు త్వం ఉందని చెబుతున్న చంద్రబాబు కోడిపందేలను నిలువరించలేకపోతున్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులే సమన్వయ కర్తలుగా పందే లు ఆడిస్తున్నారని అన్నారు. కంట్రోల్ చేయాల్సిన పోలీసు, రెవెన్యూ అధికారులు ఎక్కడకు వెళ్లారు. రాష్ట్ర హోం మంత్రి మారువేషంలో వీటిల్లో పాల్గొంటున్నారా?’ అంటూ రామకృష్ణ ఎద్దేవా చేశారు.

Share this on your social network: