కోడికత్తి కేసులో ప్రశ్నించిన ఎన్‌ఐఏ

Published: Sunday January 20, 2019

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై కోడికత్తితో దాడిచేసిన కేసులో ప్రత్యక్ష సాక్షులను ఎన్‌ఐఏ అధికారులు విచారించారు. ఇందుకోసం ఎన్‌ఐఏ అదనపు ఎస్పీ సాజిద్‌ఖాన్‌తోపాటు మరో అధికారి శనివారం విశాఖ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌ నివాసంలో వైసీపీ నేతలు మళ్ల విజయ్‌ప్రసాద్‌, తైనాల విజయ్‌కుమార్‌, కరణం ధర్మ శ్రీ, పీడిక రాజన్నదొర, మజ్జి శ్రీనివాసరావు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, తిప్పల నాగిరెడ్డి, కేకే రాజు, జియ్యాని శ్రీధర్‌, కొండా రాజీవ్‌గాంధీ, కృష్ణకాంత్‌ తదితరులను మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 à°—à°‚à°Ÿà°² వర కూ విచారించారు. à°† రోజు ఏం జరిగిందీ? à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్టుకు ఎన్ని గంటలకు వెళ్లా రు? జగన్‌ ఎన్ని గంటలకు వచ్చారు? ముందుగా వెళి తే ఎక్కడ గడిపారు? వీఐపీ లాంజ్‌లోకి ఎంట్రీపాస్‌ ఉందా? లేదా? పాసు లేకుంటే వీఐపీ లాంజ్‌లోకి వెళ్లేందుకు ఎవరు అనుమతించారు? లాంజ్‌లో ఎవరెవరున్నారు? నిందితుడు శ్రీనివాసరావును దాడి à°•à°¿ ముందు ఎప్పుడైనా చూశారా? అంటూ ఆరా తీశారు. à°“ అధికారి తెలుగులో ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టి, à°† వివరాలు సాజిద్‌ఖాన్‌కు హిందీలో అనువదించి చెబితే...ఆయన రాసుకున్నారు. ఒక్కొక్కరిని 10 నుంచి 15 నిమిషాలపాటు విచారించారు. ఎమ్మెల్యే రాజన్నదొర విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షనేతపై దాడి కేసులో పాత్రదారులను కాకుండా సూత్రదారులను విచారించాలని ఎన్‌ఐఏ అధికారులను కోరామన్నారు. అలాగే, ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌ యజమాని హర్షవర్దన్‌ను ఎన్‌ఐఏ అధికారులు విచారించినట్టు తెలిసింది.