జగన్‌కు అలవాటే: చంద్రబాబు

Published: Friday January 25, 2019
అమరావతి: à°¸à°¾à°¨à±à°•à±‚à°² నాయకత్వానికి తెలుగుదేశం ఉదాహరణ అయితే ప్రతికూల నాయకత్వానికి జగన్మోహన్‌రెడ్డి రుజువు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెడు జరగాలి, అభివృద్ది ఆగిపోవాలి అనేదే వైసీపీ పెడధోరణి అని విమర్శించారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్‌కు అలవాటే అని వ్యాఖ్యానించారు. దొంగ సర్వేలతో ప్రజాదరణను తారుమారు చేయలేరని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల ముందు ఇలానే తప్పుడు సర్వేలు చేశారని..కానీ టీడీపీ గెలిచిందని ఆయన అన్నారు. జగన్ అహంభావం భరించలేకే వైసీపీకి నేతలు దూరం అవుతున్నారని తెలిపారు.
 
రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షా 16వేల కోట్లు ఇవ్వాలని, నిధులు ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మోదీని జగన్‌ ప్రశ్నించరని మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని అయితే వైసీపీ, బీజేపీకి బాధ్యత లేదని..వారికి ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. డ్వాక్రా సంఘాలకు ప్రాణం పోసింది టీడీపీనే సీఎం తెలిపారు. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10వేలు ఇచ్చామని..మరో రూ.10వేలు ఇస్తామని వెల్లడించారు. వైఎస్ హయాంలో మహిళలకు ఇచ్చింది రూ.267కోట్లు మాత్రమే అని అన్నారు. ఆర్ధికలోటులోనూ మహిళలకు రూ.20వేల కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.