వైసీపీవి నవరత్నాలు కావు... నకిలీ రత్నాలు

Published: Tuesday January 29, 2019

‘నేనొస్తే అది చేస్తా, ఇది చేస్తా అంటారు. ఆయన వచ్చేదిలేదు, చేసేదిలేదు. కేవలం పనిగట్టుకుని తెలుగుదేశంపై బురద చల్లడమే జగన్‌ నేర్చుకున్నారు’’ అని మంత్రి కె.ఎ్‌స.జవహర్‌ వ్యాఖ్యానించారు. ఏలూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌ చెప్పేవి నవరత్నాలు కావు.. నకిలీ రత్నాలు. ఆ హామీలనే కాపీ కొడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు 10వ తరగతి చదువుకున్న రోజుల నుంచే జగన్‌కు కాపీ కొట్టే అలవాటు ఉంది’ అన్నారు. వైసీపీలోకి దగ్గుబాటి చేరికతో బీజేపీ, వైసీపీ జాయింట్‌ వెంచర్‌ అనేది అర్థమైపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత తదితరులు విమర్శలు గుప్పించారు.