పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు
Published: Thursday February 14, 2019

ఎంతో పవిత్రమైన ఓటును అమ్ముకోవాల్సిందిగా ప్రోత్సహించి, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, టీడీపీ లీగల్ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలోను, అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లోను వారు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించిన సమరశంఖారావం సభలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేలా జగన్ వ్యాఖ్యానించారని నాయకులు మండిపడ్డారు.
చంద్రబాబును ఓటుకు రూ.3 వేలకు బదులు రూ.5 వేలు అడగాలని పవిత్ర ఓటు హక్కును అమ్మకపు వస్తువుగా మార్చి మాట్లాడారని అన్నారు. జగన్‌పై తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు

Share this on your social network: