బీసీల సంక్షేమానికి హామీ ఇస్తున్నా.

Published: Monday February 18, 2019

‘జగన్‌ అనే నేను.. బీసీల సంక్షేమానికి హామీ ఇస్తున్నాను’ అంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెనుకబడిన తరగతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఆదివారం నిర్వహించిన వైసీపీ బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు. ‘బీసీలకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటాను. బీసీలంటే భారత కల్చర్‌ను ని లబెట్టిన మహనీయులు. వెనుకబడిన కులాలు జాతికి వెన్నెముక కులాలు’ అని జగన్‌ పేర్కొన్నారు. à°ˆ సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. సీఎం చంద్రబాబు బీసీలకు ఎన్నికల సమయంలో వరాలు కురిపించడానికి వస్తారని, వైసీపీ అలాకాదని, బడుగు, బలహీన వర్గాలు సగర్వంగా తలెత్తుకునేలా చేస్తుందని అన్నారు. ‘వైసీపీ అధికారంలోకి వస్తే.. బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాకుండా బ్యాక్‌ బోన్‌ క్లాస్‌à°—à°¾ తీర్చిదిద్దుతాము. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు, à°† తరువాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. మేము బీసీ సంక్షేమానికి ఏటా రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం. à°ˆ లెక్కన ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారంలోకి వస్తే.. రాబోయే అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించడంతోపాటు మూడోవంతు నిధులను కేటాయిస్తాం. à°ˆ విషయంలో వెనుకడుగు వేసే ప్రశ్నేలేదు. కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తాం. ఇప్పటి వరకు లంచాలకు, జన్మభూమి కమిటీ సిఫారసులకు నెలవైన కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దుతాం. అన్ని కులాల సంక్షేమం కోసం 139 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.’ అని జగన్‌ చెప్పారు.