ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు
Published: Tuesday February 26, 2019

గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనం వల్లే చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారని, లేదంటే జైలుకు వెళ్లేవారని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆయన సోమవారం మేధావులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జావడేకర్ మాట్లాడుతూ... 2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయిని, అంతకు ముందు మామ ఎన్టీఆర్‌ను, ప్రస్తుతం మోదీని వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
కేంద్రం విడుదల చేసే అన్ని పథకాలను చంద్రబాబు సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. భారత సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చంద్రబాబు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాక్ అధ్యక్షుడిని సమర్థిస్తున్నారన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తప్పదని చెప్పారు.

Share this on your social network: