చంద్రబాబుపై వరుస ట్వీట్లతో కేటీఆర్‌

Published: Wednesday March 06, 2019
ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. మూడున్నర కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించారని ఆరోపించారు. ‘పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం.. à°† సమాచారాన్ని à°’à°• ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమే. ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అన్నట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై మీ ఏడుపులు ఎందుకు’ అని చంద్రబాబును ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘మీరు ఏ నేరం చేయకపోతే à°ˆ ఉలికిపాటు ఎందుకు?. కోర్టులో తప్పుడు పిటిషన్లు వేసి తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
 
విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే కదా మీ భయం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘పెయిడ్‌ వ్యక్తులతో ట్విటర్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేసేందుకు టీడీపీ నాయకత్వం దుర్మార్గమైన ప్రణాళిక వేసింది. చంద్రబాబు గారూ.. నకిలీ వ్యక్తుల ద్వారా మీరు ట్వీట్లను కొనొచ్చు. కానీ.. మీకు ఓటు వేయడానికి నిజమైన ఓటర్లు కావాలనే విషయాన్ని మరిచిపోవద్దు’ అని ట్వీట్‌ చేశారు. ‘ఓటుకు నోటు’లో ఒకసారి దొరికిపోయారు. ‘ట్వీటుకు నోటు’(క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌)తో మళ్లీ ఒకసారి దొరికిపోయారు’ అంటూ కేటీఆర్‌ చురక అంటించారు.