గెలుపోటములు అనేకం చూశాం
Published: Tuesday May 28, 2019

ఈ రోజు ఓ ప్రత్యేక సందర్భంలో ఎన్టీఆర్ జయంతిని జరుపుకుంటున్నామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారం పోవడంతో అందరం కొంత బాధలోనే ఉన్నామని తెలిపారు. పార్టీ స్థాపన నుంచి గెలుపోటములు అనేకం చూశామన్నారు. మరల పార్టీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ యంత్రాంగం అంతా మీకు అండగా ఉంటుందన్నారు

Share this on your social network: