ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు

Published: Friday June 07, 2019
ఎన్నికల్లో ఒక్కోసారి ఊహించని ఫలితాలు వస్తాయని, వాటిని ఎదుర్కోవాలంటే దీర్ఘకాల ప్రణాళిక, ముందుచూపు అవసరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. భవిష్యత్తులో ఉత ్తమ ఫలితాలు సాఽధించాలంటే పార్టీకోసం పనిచేసే వారంతా ఒకే ఆలోచనా విధానంతో ముందుకు సాగాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ à°† పార్టీ తీర్మానం చేసింది. పవన్‌ నేతృత్వంలో గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. à°ˆ ఎన్నికల్లో ఓటమిని à°’à°• అనుభవంగా తీసుకుంటున్నామన్నారు. నాలుగేళ్ల వయసున్న తమ పార్టీకి ఇన్ని లక్షల మంది ఓట్లేయడాన్ని విజయంగానే భావిస్తున్నామన్నారు.
 
 
పార్టీని ఎదగనీయకుండా కొన్ని బలీయమైన శక్తులు పని చేయడంతో వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందన్నారు. తుదిశ్వాస వరకూ పార్టీని ముందుకు తీసుకెళ్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ కాలం ముగిసిందని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే మరో కమిటీ నియమిస్తామన్నారు. గాజువాక, భీమవరం రెండు చోట్లా పోటీ చేసినా.. సమయాభావం వలన ఏ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయి లో ఓటర్లను కలవలేకపోయానని అన్నారు. పార్టీ భావజాలం, నిర్ణయాలు, ప్రణాళికలను కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిపేందుకు పార్టీ పక్ష పత్రికను వెలువరించాలని నిర్ణయించినట్లు పవన్‌ తెలిపారు.