వైసీపీ సర్కారుపై టీడీపీ ఆగ్రహం

Published: Thursday July 04, 2019
రైతులు విత్తనాలు కావాలని అడిగితే.. వాటికి ఇడ్లీ, ఉప్మాతో పోలిక తెచ్చిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. బుధవారం గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లలో విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కిన దాఖలాలు లేవని, పోలీసు రక్షణతో విత్తనాలు పంపిణీ చేసే దురవస్థను మళ్లీ ఈ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. రాయలసీమలో వైసీపీ ఎమ్మెల్యేలను విత్తనాల కోసం రైతులు నిలదీస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని, గత ప్రభుత్వంపై నెట్టివేసి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
 
‘ఉత్తరాంధ్రలో వరి విత్తనాల కొరతను, రాయలసీమలో వేరుశనగ విత్తనాల కొరతను తక్షణం పరిష్కరించాలి. అటు గోదావరి డెల్టా, ఇటు కృష్ణా డెల్టా రైతులు సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు పెరిగిపోతున్నాయి. రాత్రిపూట మోటార్ల వద్ద రైతులు జాగారం చేసే పరిస్థితులు తెచ్చారు. అనేక సమస్యలతో రైతాంగం అల్లాడుతుంటే దానిని పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడం లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది. చంద్రబాబు భదత్రపైనా కోర్టుకు అవాస్తవాలు చెప్పింది. 2014à°•à°¿ ముందు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు భద్రత బాగా తగ్గించారు. భద్రత కావాలని ఆయన అడిగితే పరిశీలిస్తామని హోంమంత్రి చెప్పడం హాస్యాస్పదం’ అని పేర్కొన్నారు.