సీఎం జగన్ రాజీనామా చేస్తారా
Published: Friday July 12, 2019

సున్నా వడ్డీ పథకంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలు జోరుగా జరుగుతున్నాయి. అమలు చేసినట్టు రికార్డులను చంద్రబాబు సభలో ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి పైసా కూడా ఇవ్వలేదని.. తనను రాజీనామా చేయాలని సవాల్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఇప్పుడు సిగ్గు లేకుండా నవ్వుతున్నారన్నారు. టీడీపీ హయాంలో రుణాలు రీషెడ్యూల్ చేయలేదన్నారు... కరువు మండలాలను ప్రకటించాక రుణాలు రీషెడ్యూల్ అవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
2011 బకాయిలను కూడా తాము క్లియర్ చేశామన్నారు. సీఎం ఎందుకు అంత పరుషంగా మాట్లాడారని చంద్రబాబు ప్రశ్నించారు. ‘రాజీనామా చేసి వెళ్లిపోతారా అంటూ మాట్లాడతారా? కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చలో గాడిదలు కాశారా అని అంటారా?’ అంటూ నిలదీశారు. సున్నా వడ్డీ పథకంపై అన్ని వివరాలు సభ ముందు ఉంచుతామని.. అప్పుడు సీఎం జగన్ రాజీనామా చేస్తారా?క్షమాపణలు చెబుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు

Share this on your social network: