రెడ్డి, గిరిజన ఓట్లు గంపగుత్తగా ఫ్యానుకే

Published: Sunday August 11, 2019
‘ఐదేళ్లు ఇంత చాకిరీ చేసినా ఓడిపోవడం, మరీ ఘోరంగా 23 సీట్లే రావడం ఏమిటో అర్థం కావడం లేదు’... ఎన్నికల ఫలితాల వెలువడిన రోజు నుం చి ఇప్పటిదాకా టీడీపీ నేతలు చెబుతున్న మాట ఇది! కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో.. టీడీపీ ఓటమికీ అన్నే కారణాలున్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ! అన్నింటికంటే ముఖ్యంగా... ‘సోషల్‌ ఇంజనీరింగ్‌’లో ఈసారి టీడీపీ విఫలమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆ మాట నిజమే అని.. సీఎ్‌సడీఎ్‌స-లోక్‌నీ తి సంస్థల సంయుక్త సర్వేలో తేలింది. పోలింగ్‌ ముగిసిన తర్వా త.. ఇంకా ఫలితాలు వెలువడక ముందు ఈ సర్వే జరిగింది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలోని సామాజిక వర్గాల్లో వచ్చిన మార్పు వైసీపీ ఘన విజయానికి కారణమైందని ఈ సర్వే తేల్చింది. రెడ్డి, మాదిగ, క్రైస్తవ, గిరిజన ఓట్లను భారీస్థాయిలో సొంతం చేసుకోవడం.. టీడీపీకి పట్టుందని భావించే బీసీల్లోనూ బలం పెంచుకోవడం, చివరికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లనూ చెప్పుకోదగ్గ స్థాయిలో తనవైపునకు తిప్పికోవడమే వైసీపీ ఘన విజయానికి కారణమని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించడం వల్ల ముస్లిం మైనారిటీల్లో టీడీపీకి మద్దతు పెరిగినప్పటికీ.. గతం నుంచీ గట్టి పట్టు ఉన్న బీసీల్లో మద్దతు తగ్గిపోవడం ఆ పార్టీకి నష్టం చేసింది.
 
 
టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలపై ఎన్నికల సమయంలో బాగా చర్చ జరిగింది. కానీ, ఈ పథకాల వల్ల టీడీపీకి పెద్దగా లాభం జరగలేదని సర్వేలో వెల్లడైంది. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది టీడీపీని కాదని.. వైసీపీకే మద్దతిచ్చారు. టీడీపీ బాగా ఆశలు పెట్టుకొన్న ‘పసుపు కుంకుమ’ లబ్ధిదారులు కూడా ఎక్కువ మంది ఫ్యానుకే ఓటేశారని ఈ సర్వే తెలిపింది. నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్ల లబ్ధిదారుల్లో అధికులు తెలుగుదేశానికి ఓటు వేశారు. కానీ, వాటి లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉండటంతో టీడీపీకి ప్రయోజనం చేకూరలేదు. మొత్తానికి... ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధికంటే... సామాజిక వర్గాల ప్రభావమే ఎక్కువ కనిపించిందని సర్వే తేల్చింది.
 
గ్రామాల్లో వైసీపీకి భారీ మద్దతు లభించ గా.. పట్టణాల్లో టీడీపీకి ఆధిక్యం లభించింది. గ్రా మాల్లో టీడీపీకి 37ు.. వైసీపీకి 56ు ఓట్లు ప డ్డాయి. పట్టణాల్లో 44ు మద్దతు టీడీపీకి లభించింది. వైసీపీకి 35 శాతమే లభించింది.