వైసీపీ బాధితులకు పునరావాస కేంద్రం ఏర్పాటు

Published: Tuesday September 03, 2019
టీడీపీ నేతలతో చంద్రబాబు నేడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మూడున్నర నెలల్లో వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ఆస్తుల ధ్వంసం, భూముల కబ్జాలు, సామూహిక దాడులు, వేధింపులు, అక్రమ కేసులకు లెక్కేలేదన్నారు. ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు అందరికి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో నివసించే హక్కును ఎవరూ కాలరాయలేరని.. ఆస్తులకు, ప్రాణాలకు భద్రత కల్పించాల్సింది పోలీసులేనన్నారు.
 
 
పోలీసులే నిస్సహాయులైతే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నారు. వైసీపీ బాధితులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. అందులో భాగంగానే గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బాధితులంతా గుంటూరు శిబిరానికి తరలి రావాలన్నారు. అవసరమైతే తానే స్వయంగా బాధితులను వాళ్ల గ్రామాలకు తీసుకుని వెళతానన్నారు. జిల్లా పార్టీ నాయకులు అందరిని సమన్వయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.