టీడీపీకి ఊహించని షాక్..

Published: Wednesday September 04, 2019
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్‌లు టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస ఎదురుదెబ్బల నుంచి కోలుకోకమునుపే తెలుగుదేశంకు మరో ఊహించని షాక్ తగిలింది. టీడీపీ కీలక నేతల్లో ఒకరు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు à°† పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం.. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొంత మంది కౌన్సిలర్లు, ఇతర సంఘాల నేతలు కలిపి పది మంది పార్టీకి ఒకేసారి రాజీనామా చేయడం గమనార్హం. అయితే ఏ పార్టీలో చేరేది త్వరలో అందరితో చర్చించి ప్రకటిస్తానని సన్యాసి పాత్రుడు మీడియాకు వెల్లడించారు.
 
కాగా.. అయ్యన్నపాత్రుడు ఇంట్లో ముసలం మొదలైందని గతంలో పలుమార్లు పెద్ద పెద్ద కథనాలు వచ్చిన విషయం విదితమే. ఒకప్పుడు అన్న గెలుపు కోసం అన్నీ తానై చూసుకున్న తమ్ముడు.. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయని.. చివరికి జన్మదిన వేడుకలు కూడా వేర్వేరుగా నిర్వహించడంతో కార్యకర్తలు కూడా రెండు వర్గాలు విడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. వీరి మధ్య విభేదాలు చిలికిచిలికి గాలివానలా మారి అయ్యన్న కుమారుడు విజరుపై సన్యాసిపాత్రుడు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే దశకు చేరింది.
 
నాటి నుంచి అయ్యన్న కుటుంబంలో చోటుచేసుకున్న ఈ ముసలంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అయితే తాజాగా ఏకంగా సన్యాసిపాత్రుడు రాజీనామా చేయడం అన్నకు పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజీనామా చేసిన సన్యాసిపాత్రుడు మరో పది మంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేకుంటే కాషాయ కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.