పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తే ఊళ్లకు వెళ్తాం

Published: Tuesday September 10, 2019
పల్నాడులో రాజకీయ కక్షతో చేస్తున్న దాడులకు భయపడి టీడీపీ ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్న బాధితులను ఎట్టకేలకు పోలీసు, ఉన్నతాధికారులు సందర్శించారు. ‘మేం పెయిడ్‌ ఆర్టిస్టులమా.. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో వెంటాడి మరి దాడులు చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కట్టుకున్నవారిని, ఉన్న ఊరిని వదిలేసి వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాం. బాధల్లో ఉన్న మమ్మల్ని మరింత బాధపెట్టొద్దు. పూర్తిస్థాయి రక్షణ కల్పించండి మా ఊళ్లకు మేం వెళ్లిపోతాం’ అని పలువురు బాధితులు వారితో మొరపెట్టుకున్నారు. వద్ద పేర్కొన్నారు. గుంటూరు వైన్‌ డీలర్స్‌ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పల్నాడు వైసీపీ బాధిత శిబిరానికి సోమవారం రాత్రి గుంటూరు రూరల్‌ అదనపు ఎస్పీ కె.చక్రవర్తి, గురజాల ఆర్‌డీవో భాస్కర్‌రెడ్డి, ఇతర అధికారులు వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ‘చలో ఆత్మకూరు’కు పిలుపిచ్చిన నేపథ్యంలో వారు రావడం గమనార్హం. à°ˆ సందర్భంగా బాధితులు వారిముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘మాపైపెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.
 
మేం పెట్టిన కేసులను విచారించి దోషులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. క్షతగాత్రులకు, ఆస్తి నష్టం కలిగిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి. గ్రామాల్లో సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షించాలి. పరిస్థితి చక్కబడేదాకా పికెటింగ్‌ ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. అధికారులు వారికి పలు హామీలిచ్చారు. ‘పోలీసులకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. మాకు వాళ్లు, వీళ్లు అనే తేడా లేదు. భయపడాల్సిన పని లేదు. మీరు వస్తానంటే ఇప్పుడు నేనేదగ్గరుండి మిమ్మల్ని మీ గ్రామాలకు చేర్చి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తాం. గ్రామాల్లో పికెటింగ్‌ ఏర్పాటు చేస్తాం. మీ ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తాం’ అని చక్రవర్తి హామీ ఇచ్చారు. పూర్తి రక్షణ కల్పించి, ఆస్తులకు, భద్రతకు పూర్తి స్థాయి బాధ్యత వహిస్తామని ఆర్‌డీవో కూడా చెప్పారు.
 
‘ఏడు రోజులుగా శిబిరం నిర్వహిస్తున్నాం. ఇప్పటికి అధికారుల్లో స్పందన వచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో బాధలు పట్టించుకోవాలి. పోలీసు ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన ఎస్సైలు, సీఐలు.. రౌడీషీటు ఉన్న వైసీపీ నేతలతో కలిసి తుపాకులతో బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి’ అని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అధికారులను డిమాండ్‌ చేశారు. ‘చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. వారందరి వివరాలిస్తాం. వారి బాధ్యతలు పోలీసులు తీసుకోవాలి’ అని చెప్పారు. రాత్రి సమయంలో కాకుండా మంగళవారం తమ అధినేత చంద్రబాబుతో చర్చించి పంపిస్తామని అధికారులకు తెలిపారు.