అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు

Published: Sunday September 22, 2019
రాష్ట్రంలోని 15 శాసనసభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నికలు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. ఈ ఉపఎన్నికలు బీఎస్‌ యడియూరప్ప నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ మనుగడను తేల్చనున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి బి.ఎ్‌స.యడియూరప్ప తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని సదాశివనగర్‌లోని అటవీశాఖ అతిథిగృహానికి చేరుకున్నారు. నగరంలో అందుబాటులో ఉన్న అనర్హ ఎమ్మెల్యేలందరినీ కీలక సమావేశానికి ఆహ్వానించారు. దాదాపు గంటపాటు సమావేశం వాడీవేడిగా సాగినట్టు తెలుస్తోంది. ఒకదశలో అనర్హ ఎమ్మెల్యేలు సీఎం యడియూరప్పపై తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహావేశాలను వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తాము ఎటూ కాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చివరకు న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం సోమవారం సుప్రీం కోర్టులో ఉపఎన్నికల రద్దు కోరుతూ పిటీషన్‌ వేయాలని తీర్మానించారు.
 
 
తమపై అనర్హత వేటువేసిన స్పీకర్‌ నిర్ణయం సమంజసంగాలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మె ల్యేలు తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న తరు ణంలోనే ఎన్నికలకమిషన్‌ శనివారం 15 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 30వరకు నామినేషన్‌ల స్వీకరణ, అక్టోబరు 3వరకు ఉపసంహరణలు, అక్టోబరు 21న పోలింగ్‌, 24న కౌంటింగ్‌ జరగనుంది. ఉప ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి బి.ఎ్‌స.యడియూరప్ప సదాశివనగర్‌లోని అటవీశాఖ అతిథి గృహానికి చేరుకుని నగరంలో అందుబాటులోని అనర్హ ఎమ్మెల్యేలందరినీ కీలక సమావేశానికి ఆహ్వానించారు. దాదాపు గంటపాటు సమావేశం వాడీవేడిగా సాగినట్టు తెలుస్తోంది. ఒకదశలో అనర్హ ఎమ్మెల్యేలు సీఎం యడియూరప్పపై తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తమను నిర్లక్ష్యం చేసి రాజకీయ భవిష్యత్తును సమాధి చేశారని ఆక్రోశం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తమకు ఇంత విషమిచ్చి చంపేయాలని కొందరు అనర్హులు ఉద్వేగంతో వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. మాజీ మంత్రి డి.కె.శివకుమార్‌ చెప్పినట్టే తమ రాజకీయ సమాధి జరిగిందని వాపోయినట్టు కథనం. ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకపోవడంతో తమ రాజకీయ జీవితం అంధకారమయమైందని కొందరు ఎమ్మెల్యేలు సీఎం వద్ద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
తీవ్ర ఉద్వేగానికి గురైన అనర్హ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సీఎం తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చింది. ‘మీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోను... నేను మీతోనే ఉంటా... ఢిల్లీకి వస్తా... న్యాయవాదులతో చర్చిద్దాం.... సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేద్దాం... అంతవరకు ఓపిక పట్టండి’ అని సీఎం సర్దిచెప్పడంతో అనర్హులు కాస్త శాంతించినట్టు తెలుస్తోంది. అనర్హులతో జరిగిన ఈ రహస్య సమావేశంలో ఉపముఖ్యమంత్రి లక్ష్మణ సవదితోపాటు న్యాయశాఖ మంత్రి జె.సి.మాధుస్వామి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.విశ్వనాథ్‌, అడ్వకేట్‌ జనరల్‌ ప్రభులింగ సావడిగి కూడా హాజరయ్యారు. అనర్హ ఎమ్మెల్యేలలో ముగ్గురు మినహా 14మంది హాజరైనట్టు బీజేపీ వర్గాలను ఉటంకిస్తూ తెలిసింది.