అందరికీ ఆహార భద్రత కల్పించడమే టీడీపీ లక్ష్యం

Published: Wednesday October 16, 2019

విజయవాడ: అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నదే టీడీపీ లక్ష్యమని ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ హయాంలో ప్రారంభమైన కిలో 2 రూపాయలకే బియ్యం పథకం నుంచి అన్న క్యాంటీన్‌ వరకూ పథకాలన్నీ కూడా అందరికీ ఆహార భద్రత అన్నలక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం టీడీపీ పథకాలన్న కారణంగానే వైసీపీ ప్రభుత్వం వీటిని రద్దుచేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి అన్నక్యాంటీన్‌ వంటి పథకాలను పునరుద్దరించాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు.