వ్యాపార కేసులో రాజకీయమా?

Published: Wednesday October 23, 2019
ఇద్దరు వ్యాపార భాగస్వాముల మధ్య వచ్చిన గొడవను రాజకీయం చేస్తున్నారని.. బెయిల్‌ వ చ్చాక కూడా తన భర్త భార్గవ్‌రామ్‌ను పోలీసు లు వేధిస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. ‘అనుమతుల్లేకుండా మా ఇంట్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశా రు. ఇంట్లోకి వెళ్లి ముగ్గురిని అరెస్టు చేశామని అవాస్తవాలు ప్రచారం చేయిస్తున్నారు. నా భర్త ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్‌ చేస్తున్నారు. మ మ్మల్ని బెదిరించడానికే కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. మంగళవారం కర్నూలు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌తో పాటు మరో కొంతమందిపై అక్టోబరు 1న కేసు నమోదైన విషయం తెలిసిందే.
 
ఆ కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ని ఓ నివాసంలో ఉన్నారన్న స మాచారం సోమవారం ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసులకు తెలిసింది. వారు అక్కడకు వెళ్లి ముగ్గురినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే అనుమతుల్లేకుం డా తమ నివాసంలోకి ప్రవేశించబోయిన వారిని తాము ప్రశ్నించామని, వాస్తవానికి ఆ ముగ్గురినీ సొంత కార్లో తామే దగ్గరుండి స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించ గా.. పోలీసులు మాత్రం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అఖిలప్రియచెప్పారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా ఎస్పీ ఫక్కీర ప్పే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని స్ప ష్టం చేశారు. ఇలాంటి పనులతో పోలీసులు వా ళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారన్నారు. తన భర్త కులం వల్లే తాను ఓడిపోయానని, చాలా మందిని తాము దూరం పెడుతున్నామని కొన్ని మీడియాల్లో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తి కులం గురించి ఇలా కథనాలు ప్రసారం చేయడం బా ధాకరమన్నారు. ‘ఎస్పీ ఆదేశాల మేరకే తాము సోదాలకు రావలసి వచ్చిందని కొందరు ఎస్‌ఐ, సీఐలే నాతో ఫోన్లో చెప్పారు. ఆ వాయిస్‌ రికార్డులన్నీ ఉన్నాయి. అందరిలా మీడియాలో ప్రసారాలు చేయిం చి, పోలీసులను అగౌరవపరచ డం నాకు ఇష్టంలేదు. ఇప్పటికై నా ఎస్పీ తీరు మార్చుకోకుంటే పూర్తి ఆధారాలతో గవర్నర్‌ను క లుస్తా. వచ్చే వారంలో అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నా. అవసరమైతే రాష్ట్రపతినీ కలుస్తా. నేను మంత్రిగా ఉం డగా ఏ ఒక్కరిపైనా అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం కూడా చేయలేదు’ అని అన్నారు.