వంశీ చేరికపై వెంకట్రావు రియాక్షన్ ఇదీ..!
Published: Saturday October 26, 2019

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి టాటా చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని నిన్నట్నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం విదితమే. అంతేకాదు.. వంశీని దగ్గరుండి మరీ ఇద్దరు మంత్రులు.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే పార్టీలోకి ఎవరొచ్చినా కండిషన్ అప్లై అని జగన్ గట్టిగానే తేల్చిచెప్పారట.
అయితే ఈ వ్యవహారంపై గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘వంశీపై నేను ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టలేదు. ఇళ్ల పట్టాల విషయంలో రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌ను కలిసి గన్నవరంలో పరిణామాలన్ని వివరిస్తాను. వైసీపీలో వంశీ చేరికపై జగన్‌ను కలిశాక స్పందిస్తాం. వంశీ వల్ల వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వంశీ చేరికను నియోజకవర్గ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు’ అని వెంకట్రావు చెప్పుకొచ్చారు.
ఈ చేరికపై వంశీ ఎలా రియాక్ట్ అవుతారో అన్నదానిపై అటు వైసీపీ వీరాభిమానులు, ఇటు టీడీపీ కార్యకర్తలు, అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున వల్లభనేని వంశీ.. వైసీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థిపై స్వల్ప ఆధిక్యం 838 ఓట్ల తేడాతో వంశీ గెలుపొందారు.

Share this on your social network: