ఇసుక కొరత జగన్ గిఫ్ట్
Published: Tuesday October 29, 2019

వైసీపీ ప్రభుత్వం తీరుపై ట్విటర్ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ‘‘రంగులేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని రూలింగ్ చేయడానికి పనికిరాని పార్టీ వైసీపీ. 151 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్‌గా ఇసుక కృత్రిమ కొరత సృష్టించి రూ.150 కూలి కూడా రాని పరిస్థితికి భవన నిర్మాణ కార్మికులను తీసుకువచ్చిన ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని నేను ఇంత వరకూ చూడలేదు’’ అని ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు వైసీపీ రంగులేసిన పంచాయతీ, పాఠశాల భవనాలు, నీళ్ల ట్యాంకు, బోరు, స్వాగత ద్వారం చిత్రాలను ట్యాగ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. ‘‘తనకు అత్యధికంగా 151 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ గిఫ్ట్‌గా ఇసుక కొరత ఇచ్చారు. సీఎం మాటకు, మంత్రుల మాటలకు సంబంధం ఉండడం లేదు. జగన్ ప్రకటిస్తున్న వరాలకు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎంత మాత్రం పొంతన కుదరటం లేదు’’ అని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
‘‘పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లకుండా ఆపేందుకే వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందన్న వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఆధారాలు చూపకుండా రివర్స్ టెండరింగ్‌తో చేతులు దులుపుకుంది’’ అని బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అవినీతి జరి గి ఉంటే, అవినీతి పరులను శిక్షించాలితప్ప స్వలాభం కోసం రాజకీయాలు చేయడం సబబు కాదని ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్ ఛిన్నాభిన్నం చేశారని విమర్శించారు. సోమవారం నెల్లూరు లో జరిగిన గాంధీజీ సంకల్పయాత్ర ముగింపు సభలో ఎంపీ మాట్లాడారు. రఇప్పటివరకు తానెప్పుడూ ఇలాంటి పాలనను చూడలేదన్నారు.

Share this on your social network: