ఇసుక వారోత్సవాలపై చంద్రబాబు ధ్వజం

Published: Wednesday October 30, 2019
ఇసుకపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు కాదు.. ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలు జరపాలన్నారు. పార్టీ శ్రేణులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటు అన్నారు. గతంలో నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు ఉన్నారని... ఇప్పుడైతే ఊరికో వైసీపీ ఇసుకాసురులు తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరకాసురుడి అంతంతోనే దీపావళి వచ్చిందని.. ఇక ఇసుకాసురుల భరతం పడితేనే పేదలకు దీపావళి వస్తుందని చెప్పారు. ‘ఆత్మహత్యలకు ప్రేరేపించే పాలసీలు తెస్తారా..?, ఇసుక వారోత్సవాలు అనడానికి సిగ్గుండాలి. à°’à°• పక్క ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ‘నీకు మాత్రం వారోత్సవాలా’..?, ఇసుకపై, మట్టిపై నీ పెత్తనం ఏమిటి..?, సొంత పొలంలో ఉండే మట్టి తీసుకెళ్లడానికి నీ అనుమతి కావాలా..?, సొంత ఊళ్లో వాగు ఇసుక తీసుకెళ్లడానికి నీ అనుమతి కావాలా..? అంటూ’ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అయినా తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది..? , దేశంలో ఎక్కడా లేని ఇసుక కొరత సృష్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తక్షణమే ఇసుకపై సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో వైసీపీ నేతల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. ఇసుక స్మగ్లర్లు కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు. మీ తీరు వల్ల నిరుపేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.
 
 
‘కూలీలకు à°…à°‚à°¡à°—à°¾ ఉండేవాళ్లను.. రాబందుల్లా రాళ్లేస్తున్నారని అంటారా..?, రాబందులు మేము కాదు, రాక్షసుల్లా మీరే వ్యవహరిస్తున్నారని’ విమర్శించారు. మంగళవారం పిడుగురాళ్లలో ట్రక్కు డ్రైవర్ గోపి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇసుక కొరత వల్ల ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఆత్మహత్యలపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆరు కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకోవాలని స్పష్టం చేశారు. మానవ హక్కుల కమిషన్ ఎదుటే వైసీపీ నేతల దౌర్జన్యాలు బైటపడ్డాయన్నారు. ‘పొనుగుపాడు గోడ చూడటానికి వచ్చినవాళ్ల ఎదుటే దౌర్జన్యాలా..? , à°’à°• వైపు మానవ హక్కుల కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తుంటే.. మరోవైపు అనంతపురం జిల్లా వెంకటాపురంలో గోడలు కడతరా?