తెలుగును తీసేస్తామనే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు

Published: Friday November 22, 2019

‘‘తెలుగును తీసేస్తామనే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. మాధ్యమాన్ని ఎంచుకునే అధికారం తల్లిదండ్రులకే ఇవ్వాలి. తెలుగుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తమిళనాడులో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు తమిళంలోనే జరుగుతాయని, అయినా వారు ఇంగ్లీషులో బాగా మాట్లాడతారని తెలిపారు. రాష్ట్రంలో ఆంగ్లంలో పాఠాలు చెప్పేందుకు టీచర్లు ఉన్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కుల ఆధార రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. కులం, మతంతో టీడీపీ, వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు.. తన దగ్గర సమాచారం లేదన్నారు.